Switch to English

ఫాదర్స్ డే స్పెషల్‌.. టాలీవుడ్ తండ్రి కొడుకులు చాలా స్పెషల్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

టాలీవుడ్ లో వారసులు ఎక్కువే అనే విషయం తెల్సిందే. ముఖ్యంగా తండ్రి హీరో అయితే ఆయన పిల్లల్లో ఎక్కువ శాతం హీరోలుగా అవుతున్న వారే ఉన్నారు. ఇప్పటికే ఉన్న స్టార్‌ హీరోల్లో మెజార్టీ శాతం స్టార్ హీరోల పిల్లలే ఉన్నారు. అందులో సూపర్ స్టార్‌ లు అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు మరియు తండ్రి కూతుళ్ల మద్య అనుబంధం ఎలా ఉంటుంది… వారు వెండి తెరపై ఎలా కనిపించారు అనేది నేడు ఫాదర్స్ డే సందర్బంగా చూద్దాం..

చిరంజీవి – చరణ్‌

ఫాదర్స్ డే స్పెషల్‌.. టాలీవుడ్ తండ్రి కొడుకులు చాలా స్పెషల్‌

ప్రస్తుత జనరేషన్ కు ఈ తండ్రి కొడుకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ అంటే చిరంజీవికి ఎంతటి అభిమానం ప్రేమ ఉంటుందో అందరికి తెల్సిందే. చిరంజీవి మరియు చరణ్ లను పలు సందర్బాల్లో వెండి తెరపై చూశాం. ఆచార్య సినిమా లో ఒక పూర్తి స్థాయి మల్టీ స్టారర్ గా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీరిద్దరి మద్య ఉండే ప్రేమ అన్యోన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ మెగా ఫ్యాన్స్ అంటూ ఉంటారు.

ఎన్టీఆర్‌ – బాలయ్య…

ఫాదర్స్ డే స్పెషల్‌.. టాలీవుడ్ తండ్రి కొడుకులు చాలా స్పెషల్‌

సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తండ్రి వారసత్వంను పుణికి పుచ్చుకుని మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నాడు. తన ప్రతి సినిమా లో కూడా ఏదో ఒక సమయంలో తండ్రి ఎన్టీఆర్‌ ప్రస్థావన డైరెక్ట్‌ గా లేదా ఇండైరెక్ట్ గా తీసుకు వస్తాడు. బాలయ్య కు తండ్రి ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో ఆయన మాటలు మరియు చేతలను బట్టి అర్థం అవుతుంది. పలు సినిమాల్లో ఈ తండ్రి కొడుకులు కలిసి నటించారు.

నాగేశ్వర రావు – నాగార్జున 

ఫాదర్స్ డే స్పెషల్‌.. టాలీవుడ్ తండ్రి కొడుకులు చాలా స్పెషల్‌

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా నాగార్జున అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆయనతో ఆరు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నాగార్జున తండ్రి అక్కినేని బాటలో నటుడిగా నిర్మాతగా రాణిస్తున్నారు. ఇక నాగార్జున నట వారసులుగా నాగ చైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రి లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే

కృష్ణ – మహేష్‌ బాబు..

ఫాదర్స్ డే స్పెషల్‌.. టాలీవుడ్ తండ్రి కొడుకులు చాలా స్పెషల్‌

టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ గా కృష్ణ ఏ స్థాయి లో సక్సెస్‌ అయ్యారో అంతకు మించి అన్నట్లుగా ఆయన వారసుడు మహేష్ బాబు సక్సెస్ అయ్యారు. తండ్రికి తగ్గ కొడుకు.. తండ్రిని మించిన కొడుకు అన్నట్లుగా మహేష్‌ బాబు పేరు దక్కించుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అన్నట్లుగా మహేష్ బాబు తన తండ్రి వద్ద చాలా వినమ్రంగా ఉంటూ గౌరవిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా కృష్ణ అంటే ఎంతో గౌరవంతో మహేష్‌ బాబు వ్యవహరిస్తూ ఉంటాడు. మహేష్‌.. కృష్ణ కలిసి చాలా సినిమాల్లో నటించారు. మరో వైపు మహేష్ బాబు కూడా తండ్రిగా మారి గౌతమ్‌ మరియు సితారలను గొప్ప వాళ్లుగా తీర్చి దిద్దే క్రమంలో ఉన్నాడు. త్వరలో గౌతమ్‌ స్టార్‌ నటుడు అయ్యే అవకాశం ఉంది.. సితార కూడా తాను ఉన్న రంగంలో ఉన్నత స్థాయి లో ఉండే అవకాశం ఉంది. మహేష్ సినిమాలో గౌతమ్‌ నటించిన విషయం తెల్సిందే.

హరికృష్ణ – ఎన్టీఆర్‌ – కళ్యాణ్ రామ్‌…

ఫాదర్స్ డే స్పెషల్‌.. టాలీవుడ్ తండ్రి కొడుకులు చాలా స్పెషల్‌

సీనియర్ ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ. సినిమా ల్లో హరికృష్ణ రాణించాడు. ఆయన వారసులు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్‌ రామ్‌. ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ నందమూరి అభిమానులను ఎంటర్‌ టైన్ చేస్తూ వస్తున్నారు. కొన్నాళ్ల క్రితం హరికృష్ణ చనిపోయిన సమయంలో ఎన్టీఆర్‌.. కళ్యాణ్ రామ్‌ లు ఎంతగా మదన పడ్డారో తెల్సిందే. ఇద్దరికి కూడా హరికృష్ణ తో ఎంతో అన్యోన్యత ఉంది. ఎన్టీఆర్‌ తన ప్రతి సందర్బంలో కూడా తండ్రి హరికృష్ణను తల్చుకుంటూ ఉంటాడు.

మోహన్‌ బాబు – మంచు విష్ణు – మంచు మనోజ్‌ – మంచు లక్ష్మి..

ఫాదర్స్ డే స్పెషల్‌.. టాలీవుడ్ తండ్రి కొడుకులు చాలా స్పెషల్‌

టాలీవుడ్‌ లో సీనియర్‌ హీరో అయిన మోహన్‌ బాబు నట వారసులుగా ఆయన ముగ్గురు పిల్లలు ఎంట్రీ ఇచ్చారు. ఆ ముగ్గురు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆ ముగ్గురికి తండ్రి మోహన్‌ బాబు అంటే ఎంతో గౌరవం మరియు మర్యాద.

ఇంకా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ వారి తండ్రులను గురించి గొప్పగా చెప్పుకోవడం.. తండ్రుల వల్ల ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. హీరోయిన్స్ లో కూడా చాలా మంది తండ్రులకు చాలా ఎమోషనల్‌ బాండింగ్  ఉంది అంటూ పలు సందర్బాల్లో చెబుతూ వచ్చారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు మరియు తండ్రి కూతుర్ల కు సంబంధించిన సెంటిమెంట్‌ సినిమాలు వందల కొద్ది వచ్చాయి. అందులో సూపర్‌ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. నాన్నకు ప్రేమతో.. మా నాన్నకు పెళ్లి… అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఇలా నాన్న నేపథ్యంలో చాలా చాలా సినిమాలు చేసిన ఘనత కూడా తెలుగు ఫిల్మ్‌ స్టార్స్ కి మాత్రమే దక్కింది.

5 COMMENTS

  1. 497472 143871Highest quality fella toasts, or toasts. will most surely be given birth to product or service ? from the party therefore supposed to become surprising, humorous coupled with enlightening likewise. greatest man speaches 74991

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...