Switch to English

వెన్నెల ఓ తెల్ల కాగితం.. అమాయకత్వం, రానెస్ రెండూ ఉంటాయి: సాయి పల్లవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరాటపర్వం’. 1990ల్లో జరిగిన యాదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో సురేశ్ బాబు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాణంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

తెలంగాణ ఆడపడచులా..

ఇటివలే సరళ గారి కుటుంబాన్ని కలవడం చాలా ఎమోషనల్ మూమెంట్. నన్ను చూస్తే తెలంగాణ ఆడపడుచులా ఉన్నానని అంటున్నారు. బహుశా గత జన్మలో ఇక్కడే పుట్టుంటానేమో. వెన్నెల పాత్రలో రానెస్, అమాయకత్వం రెండూ ఉంటాయి. వెన్నెల ఒక తెల్ల కాగితం. దానిపై ఏది రాస్తే అదే వెన్నెల. రవన్న పాత్ర రానా చేస్తారని తెలిసినప్పుడు చాలా సంతోషం వేసింది. ఆయన స్టార్ డమ్, వాయిస్ పాత్రకి సరిపోతారని అనిపించింది. రానా రాకతో విరాటపర్వం స్కేల్ మారిపోయింది. ఆయన కథల ఎంపిక అద్భుతం. ప్రియమణి, నందితా దాస్ తో కలిసి నటించడం మంచి అనుభూతి.

ఇమేజ్ గురించి ఆలోచించను

ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా విరాటపర్వం. నేను ప్రేక్షకుల ప్రేమనే తీసుకుంటాను తప్ప.. ఇమేజ్ గురించి ఆలోచించను. మంచి కథ, సినిమా చేయాలనే ఒత్తిడి తప్ప ఇంకేమీ అలోచించను. సినిమా ఆలస్యమైనందుకు కంగారు పడినా.. విడుదలకు ఇదే సరైన సమయం. కరోనా తర్వాత ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ కి వస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలు చూస్తున్నారు. విరాటపర్వం వారికి తప్పకుండా నచ్చుతుంది. తెలీని కథ చేయడంలో మజా వుంటుంది. అప్పుడే నటిగా ఎదుగుతాను. ప్రతి పాత్రకి కొంత భాద, ఒత్తిడి ఉండాలి. లేదంటే బోర్ కొడుతుంది.

వేణు ఎంతో రీసెర్చ్ చేసారు..

వేణు ఉడుగులలో గొప్ప రచయిత ఉన్నారు. తనకు తెలిసిన పరిస్థితుల గురించి తన కంటే ఎవరూ గొప్పగా రాయలేరని నమ్ముతాను. సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసారు. ఇలాంటి కథలెన్నో ఆయన రాయాలి. విరాటపర్వంలో చూపిన ఊరు, మనుషులు నిజంగా ఉంటారు. మన ఊర్లో అమ్మాయిలు అలానే కూర్చుంటారు, అలానే మాట్లాడుతారు. ఒక రా ఫీలింగ్ ఇచ్చాయి. విరాటపర్వం నా వరకూ ఒక లెర్నింగ్ ప్రాసెస్. వేణు కొత్త విషయాలు నేర్పారు. విరాట పర్వం నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా.

కథే నన్ను వెతుక్కుంటూ వస్తుంది

ఆడియన్స్ కి ఏ సినిమా నచ్చుతుందో మనం చెప్పలేం. మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడమే నా పని. ఎప్పటికీ నిలిచిపోయే సినిమానే చేయలని భావిస్తాను. నా కోసం ఒక కథ వుంటే అది తప్పకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుందని భావిస్తా. విరాటపర్వం ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా. ప్రస్తుతం గార్గి సినిమా చేస్తున్నాను. విరాటపర్వంలానే మంచి సినిమా అవుతుంది. తెలుగులో కథలు వింటున్నా. తమిళంలో శివకార్తికేయన్ తో ఒక సినిమా సైన్ చేశాను.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...