Switch to English

‘పది’ పంచాయితీ: లోకేష్ ‘జూమ్’లోకి చొరబడిన వైసీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘ఏం కక్కుర్తి ఇది.?’.. తెలుగుదేశం పార్టీ ప్రశ్న.! ‘మమ్మల్ని చూసి వణికిపోయిన పప్పు’.. వైసీపీ ఎదురుదాడి.!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్, పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు వెల్లడి కాగా, పదో తరగతి పరీక్షల నుంచీ నడిచిన రాజకీయం.. ఆ తర్వాత మరింత ముదిరి పాకాన పడి, ఫలితాలొచ్చాక.. ఇంకా రచ్చ కొనసాగుతూనే వుంది.

పదో తరగతి ఫలితాల్లో 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవడం, ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పడిపోవడంపై వైఎస్ జగన్ సర్కారు,రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి వున్నా, ఇంకా బుకాయింపులతోనే సరిపెడుతోందన్నది విపక్షాల వాదన.

సరే, ‘కోవిడ్ సమస్య..’ అంటూ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడమే కాదు, విద్యార్థులిలా తక్కువ ఉత్తీర్ణత సాధించడానికి కారణం టీడీపీకి చెందిన నారాయణ, పదో తరగతి ప్రశ్నా పత్రాల్ని లీక్ చేయడమేనంటూ ఎదురుడికి దిగడం మరో ఆసక్తికరమైన అంశమిక్కడ.

రాష్ట్రం ఎందుకు ఇలా భ్రష్టుపట్టిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. అంతర్వేది రధం ఎందుకు దగ్ధమైంది.? అంటే, విపక్షాల కుట్ర అన్నారు. విపక్షాలకు చెందిన ఒక్క నాయకుడ్నీ ఈ కేసులో బుక్ చేసి జైలుకు పంపలేకపోయింది వైసీపీ సర్కారు.

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకూ విపక్షాలే కారణమంటూ యాగీ చేయడం అలవాటైపోయింది. ఇలా చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేసే వైసీపీ, నారా లోకేష్ జూమ్ మీటింగ్‌లోకి చొరబడటంలో వింతేముంది.? విద్యార్థుల్ని వెంటేసుకుని, నారా లోకేష్‌కి షాకిచ్చేద్దామని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ జూమ్ మీటింగులోకి దూసుకొచ్చారు.

‘దొంగ చాటుగా వస్తారా.? ఇదేం బుద్ధి.?’ అని నారా లోకేష్ నిలదీసేసరికి, ఆ ఇద్దరూ చల్లగా జారుకున్నారు. ఇదీ రాష్ట్రంలో నడుస్తున్న చిత్ర విచిత్రమైన రాజకీయ నాటకం. వైసీపీనే ఓ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చుకదా.. టీడీపీ జూమ్ మీటింగ్‌లోకి చొరబడాల్సినంత కక్కుర్తి ఏమొచ్చిందట.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...