Switch to English

వైసీపీకి వేరే శత్రువులు అవసరం లేదు సుమీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రోజురోజుకీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అత్యంత వికారంగా తయారవుతోంది. నేరాలు జరుగుతున్నాయ్.. దారుణాలు చోటు చేసుకుంటున్నాయ్.! వీటిపై హోంమంత్రి మాట్లాడుతూ, ‘అవి జరుగుతూనే వుంటాయ్..’ అని సెలవిస్తున్నారు. ‘అబ్బే, అత్యాచారం చేయడానికి వెళ్ళలేదు.. డబ్బులు దోచుకుందామనుకున్నారు.. కానీ, అత్యాచారం జరిగిపోయిందంతే..’ అని సాక్షాత్తూ హోంమంత్రి చెప్పడం రాష్ట్రం ఇప్పుడెదుర్కొంటున్న దయనీయ స్థితిని చెప్పకనే చెబుతున్నాయ్.

‘ఇదంతా విపక్షాల కుట్ర.. దుష్ట చతుష్టయం చేస్తోన్న దుర్మార్గం.. మంచి పాలన అందిస్తోంటే ఓర్వలేనితనం..’ అంటూ ముఖ్యమంత్రి ఎంతగా నెపాన్ని రాజకీయ ప్రత్యర్థుల మీదకు నెట్టేస్తున్నా, రాష్ట్రానికి జరగకూడని అన్యాయమే జరిగిపోతోంది. ‘బటన్ నొక్కి నేరుగా..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు.

నిజమే, ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నారు.. నిధులు విడుదలవుతున్నాయ్. కానీ, అవి ఎక్కడికి చేరుతున్నాయన్నదే కీలకం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయ్.. తిరిగి అది ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఎలా మారుతోంది.? ప్రభుత్వంలో వున్నవారికి అదెలా మేలు చేస్తోంది.? ఇలాంటి అంశాలపై జనం ఆలోచించుకోకుండా వుంటారా.?

రాష్ట్రంలో అభివృద్ధి ఊసు లేదు. కానీ, సంక్షేమం కోసం బటన్ నొక్కేస్తున్నారు. ఉద్యోగుల జీతాలకు కూడా అలాటే ఠంచనుగా బటన్ నొక్కితే పోలా.? అంటూ జనసేన పార్టీ సంధిస్తున్న ప్రశ్నకు వైసీపీ నుంచి సమాధానమే దొరకడంలేదు. ఏమన్నా అంటే, పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారంటూ మంత్రులు, పనికిమాలిన పురాణాన్ని తెరపైకి తెస్తారు.

మూడేళ్ళవుతోంది కదా అధికారంలోకి వచ్చి.. ఇంతకీ, రాష్ట్రానికి రాజధాని ఏది.? అంటే సమాధానం చెప్పలేని దుస్థితి వైసీపీది. అందుకే, ముఖ్యమంత్రి మీటింగుల నుంచి జనం పారిపోతున్నారు. ప్రతిదానికీ విపక్షాల మీదకు తోసేస్తే జనం మాత్రం ఎలా జీర్ణించుకోగలరు.? వైసీపీకి వేరే శతృవు అవసరం లేదు. ముఖ్యమంత్రి సహా వైసీపీ నేతల్లో పెరిగిపోతున్న అసహనమే వైసీపీ కొంప ముంచేయనుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...