Switch to English

‘భీమ్లానాయక్’ బ్రాండ్ అంబాసిడర్లు వైసీపీ నేతలే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పవన్ కళ్యాణ్ సినిమాలకి కొత్తగా ప్రచారం అవసరం లేదు. ఆయన సినిమాల్ని ఆ స్థాయిలో ఎప్పుడూ ప్రమోట్ చేయడం కూడా ఎప్పుడూ చూడం. ఎందుకంటే, సినిమా ప్రమోషన్ల పట్ల ఆయన పెద్దగా ఆసక్తి చూపరు. అయితే, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలకి వైసీపీ నేతలు ప్రచారకర్తలు.. అదేనండీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్నారు.

‘వకీల్ సాబ్’ సినిమా విషయమై పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా బీజేపీ, టీడీపీ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ మాటల వల్ల ‘వకీల్ సాబ్’ సినిమాకి పెద్దగా ఒరిగిందేమీ లేదు. అయితే, వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి, సినిమాకి రివ్యూలు ఇవ్వడం మొదలెట్టాక, ‘వకీల్ సాబ్’ సినిమా వసూళ్ళు మరింత పెరిగాయి.

వైసీపీ ఇచ్చే నెగెటివ్ రివ్యూలు పవన్ కళ్యాణ్ సినిమాలకి మంచి బూస్ట్ అవుతున్నాయి. క్రమం తప్పకుండా ఓ పద్ధతి ప్రకారం వైసీపీ నేతలు, ‘భీమ్లానాయక్’ సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇప్పటిదాకా తమ ‘బాధ్యత’ని సక్రమంగా నిర్వహించేశారు.

లిస్టులో ఇంకా కన్నబాబు, అవంతి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్ తదితర మంత్రులున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావొచ్చు. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో తనవంతు పాత్ర సోషల్ మీడియా వేదికగా పోషిస్తున్నారాయె.

అంతా బాగానే వుందిగానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి.? అప్పుల మాటేమిటి.? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ నేషనల్ మీడియా కోడై కూస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎక్కడ.? ఆయన కూడా ‘భీమ్లానాయక్’ సినిమాకి రివ్యూ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారా.? అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో కూడా ‘భీమ్లానాయక్’ సినిమా విషయాన్ని ప్రస్తావిస్తే.. అప్పటికి చప్పగా మారే వసూళ్ళు మళ్ళీ పుంజుకుని, ‘భీమ్లానాయక్’ నిర్మాతకి మరింత లాభాలు తెచ్చిపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....