Switch to English

టీజర్‌ హాటు.. డైరెక్టర్‌ భార్యకి ‘ట్విట్టర్‌’ పోటు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న ‘మన్మథుడు-2’ సినిమా టీజరొచ్చింది. టీజర్‌లో రొమాన్స్‌, కామెడీ ప్రధాన అంశాలుగా కన్పిస్తున్నాయి. 59 ఏళ్ళ వయసున్న నాగార్జున, తన వయసులో సగం వయసు కూడా లేని అందాల భామలతో (రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్) రొమాన్స్‌ ఇరగదీసేస్తున్నాడు. ఎంతైనా రొమాంటిక్‌ కింగ్‌ కదా! సినిమా అన్నాక ఇవన్నీ మామూలే.

ఏం, చిరంజీవి ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా కోసం కాజల్‌ అగర్వాల్‌తో రొమాన్స్‌ చేయలేదు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, నిండా 20 ఏళ్ళు కూడా లేని ఓ చిన్నమ్మాయితో హాట్‌ హాట్‌గా నటించేయలేదు. వివాదాలు మామూలే, సినిమాల్లో కంటెంట్‌ మామూలే. ఇక్కడ నాగార్జున రొమాన్స్‌ని ప్రశ్నించేవారికంటే, ఈ ఏజ్‌లో ఇంత రొమాంటిక్‌గా ఎలా వుంటున్నాడు.? అసలు ఆ మన్మథుడి లుక్‌ వెనుక సీక్రెట్‌ ఏంటి.? అని ఆశ్చర్యపోయేవాళ్ళే ఎక్కువ.

అయితే, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ భార్య, సినీ గాయని చిన్మయికి ‘మన్మథుడు-2’ టీజర్‌ కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేసింది. ఆమెకి ఈ సినిమా టీజర్‌ భలేగా నచ్చేసింది. అదే పెద్ద సమస్య అయి కూర్చుందిప్పుడు. ‘కూతురి కంటే తక్కువ వయసున్న హీరోయిన్లతో హీరోలు రొమాన్స్‌ చేయడమేంటి.?’ అంటూ కొన్నాళ్ళ క్రితం సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించింది చిన్మయి.

‘మీటూ’ ఉద్యమంలో భాగంగా చిన్మయి చెప్పిన నీతులు అన్నీ ఇన్నీ కావు. మరిప్పుడేమంటావ్‌? అంటూ ‘మన్మథుడు-2’ టీజర్‌ని ట్యాగ్‌ చేసి, చిన్మయిని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ‘సినిమాలో కంటెంట్‌ ఏంటో తెలియకుండా మాట్లాడొద్దు’ అంటూ నెటిజన్ల ప్రశ్నలకు తనదైన స్టయిల్లో రిటార్ట్‌ ఇస్తోంది చిన్మయి. ‘భలే కవర్‌ చేస్తున్నావ్‌.. ఎంతైనా నీ భర్త దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కదా.. అందులో బూతులున్నా నీకు బాగా నచ్చేస్తాయ్‌..’ అంటూ చిన్మయి మీద సెటైర్లు పడ్తున్నాయి.

గతంలో సమంత, ఓ సినిమా పోస్టర్‌లో హీరో కాళ్ళని హీరోయిన్‌ తాకేందుకు ప్రయత్నించడాన్ని ప్రశ్నించి, ఇదిగో ఇలాగే వివాదాల్లోకెక్కింది. ఆ సమంతకి డబ్బింగ్‌ చెప్పడం ద్వారా చిన్మయి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ స్టార్‌డమ్‌ సంపాదించుకున్న విషయం విదితమే. ఇంతకీ, ‘మన్మథుడు-2’ సినిమాలో ‘అక్కుం బక్కుం’ సీన్స్‌ వున్నాయా.? వున్నా, వాటిని చిన్మయి వెనకేసుకొస్తుందా.? వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...