Switch to English

హతవిధీ.. ఏమిటీ దుస్థితి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై 46 ఏళ్ల వయసున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి పంచుల మీద పంచులు వేస్తున్నారు. బాబు రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని కొత్త ఎమ్మెల్యేలు ఏకంగా ఆయన్ను ర్యాగింగ్ తరహాలో సభలో ఆటాడుకుంటున్నారు. ఇటు చూస్తే 150 మందితో అధికార పక్షం.. అటు చూస్తే చంద్రబాబు సహా 23 మందికే ప్రతిపక్షం పరిమితం. చంద్రబాబు వంటి సీనియర్ నేతకు ఇది చాలా ఇబ్బందికర అంశంగా మారింది.

కొత్తగా వచ్చిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అదే పనిగా బల్లలు చరుస్తూ.. ప్రతిపక్షంపై, అందులోనూ చంద్రబాబుపై సెటైర్లు కూడా వేస్తున్నారు. ఓడలు బండ్లు కావడం.. బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో. గత సభలో 67 మంది సభ్యులతో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే అధికార పక్షంగా ఉన్న టీడీపీ.. వారి పట్ల ఎలా వ్యవహరించిందో అందరూ చూశారు. ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలతో టీడీపీలో చేర్చుకున్నారు. ఇక సభలో అయితే వైఎస్సార్ సీపీ సభ్యులకు మాట్లాడే అవకాశమే సరిగా ఇవ్వలేదు. దీంతో వీటన్నింటినీ నిరసిస్తూ ఆ పార్టీ అసెంబ్లీ సమావేశాలనే బాయ్ కాట్ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్య తీసుకునేంత వరకు సభలో అడుగు పెట్టేది లేదని తెగేసి చెప్పింది.

ఇప్పుడు పరిస్థితి మారింది. అధికార పార్టీ ప్రతిపక్షానికి వెళ్లగా.. ప్రతిపక్షానికి అధికారం చేతికందింది. మరి గత సభలో జరిగిన పరాభావాలకు బదులు తీర్చుకోవాలనే కసి సహజంగానే ఎవరికైనా ఉంటుంది. అందులోనూ తిరుగులేని మెజార్టీతో గెలుపొందిన పార్టీ కావడంతో ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ఏం చేసినా చెల్లుతుంది. అయితే, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం పార్టీ ఫిరాయింపులపై చాలా హూందాగా వ్యవహరించారు. విలువలతో కూడిన రాజకీయాలే చేస్తానని గతంలో చెప్పిన మాటకే ఆయన కట్టుబడ్డారు. తాను తలుచుకుంటే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలనని, కానీ తాను ఆ పని చేయబోనని స్పష్టంచేశారు. దీనిపై సర్వ్రతా హర్షం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో సైతం జగన్ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు.

ఎంత అనుభవం ఉందన్నది కాదు.. ఎలాంటి రాజకీయాలు చేస్తున్నామన్నదే ముఖ్యమంటూ చంద్రబాబును ఉద్దేశించి సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇలా అటు సభలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ చంద్రబాబును ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ సీఎంగా చంద్రబాబు అనుభవించిన పలు సౌకర్యాలకు కూడా కొత్త సర్కారు కోత వేసింది. బాబు కాన్వాయ్ లో ఉండే పైలట్, ఎస్కార్ట్ వాహనాలను తొలగించడంతోపాటు, ఇప్పటివరకు ఆయనకు ఉన్న రోడ్ క్లియరెన్స్ సౌకర్యాన్ని కూడా ఎత్తివేసింది.

ఇక అసెంబ్లీలో టీడీపీ కోరిన చాంబర్ల కేటాయింపు కూడా జరగలేదు. ఈ పరిణామాలన్నీ టీడీపీ అధినేతకు ఇబ్బందిగా పరిణమించాయి. కొత్త సర్కారు కొలువు తీరి రెండు వారాలైనా కాక ముందే ఇన్ని ప్రతికూల పరిణామాలు సంభవించడంతో.. ఈ ఐదేళ్లలో ఇంకా ఎలాంటి అంశాలను ఎదుర్కోవాలా అని తెలుగు తమ్ముళ్లు మథనపడుతున్నారు. ఏది ఏమైనా.. మన వ్యవహార శైలిని బట్టే ఎదుటివారి ప్రవర్తన ఆధారపడి ఉంటుందని గత ప్రభుత్వ పెద్దలు ఆలోచించి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేదని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ ఒరవడిని ప్రస్తుత అధికార పార్టీ మార్చి, ప్రతిపక్షంపై కక్ష సాధింపులకు పాల్పడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళితే బావుంటుందని అంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...