Switch to English

ఉత్తరాంధ్రలో ఉద్యమం లేవదీస్తారట.. ఎలా చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

ఉత్తరాంధ్ర.. వెనకబడిన ప్రాంతం కాదు, వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఉత్తరాంధ్రలోనే, విశాఖపట్నం కూడా వుంది. విశాఖపట్నం నగరం తప్పితే, ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా వెనుకబాటుతనమే కనిపిస్తుంది. టీడీపీ పాలన, కాంగ్రెస్ పాలన, కొత్తగా వైఎస్సార్సీపీ పాలన.. ఎవరు పరిపాలిస్తేనేం.. ఉత్తరాంధ్ర వెనుకాబటుతనం మాత్రం అలాగే వుంది.

అణచివేతను తట్టుకుని ఉత్తరాంధ్రలో గట్టిగా నిలబడింది విశాఖపట్నం మాత్రమే. రక్షణ పరంగా వ్యూహాత్మకమైన ప్రాంతం కావడం సహా కొన్ని ప్రత్యేకతల కారణంగా ఆమాత్రం అయినా విశాఖ నిలదొక్కుకుంది. అంతే తప్ప, పాలకులెవరూ విశాఖను ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది లేదు.

ఉత్తరాంధ్ర అంటే ఉప్పుగల్లాలు.. ఉత్తరాంధ్ర అంటే అమాయకత్వం.. ఉత్తరాంధ్ర అంటే కష్టపడే తత్వం.. ఉత్తరాంధ్ర అంటే ఉద్యమం.. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అదే ఉత్తరాంధ్రకు శాపం. ఇప్పుడు కొత్తగా, ఉత్తరాంధ్రలో ఉద్యమాన్ని లేవదీస్తారట.. అలాగని అధికార పార్టీకి చెందిన ఒకాయన, అందునా.. మంత్రిగారొకరు సెలవిచ్చారు.

ఒకప్పుడు ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర.. ఆ ఉత్తరాంధ్రకే ఉద్యమ పాఠాలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు నేటితరం కుర్ర నాయకులు. ఉద్యమం దేనికోసం.? విశాఖ రాజధాని కోసమా.? ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమా.? తమ పదవుల్ని నిలబెట్టుకోవడం కోసమా.?

అమరావతి పేరుతో చంద్రబాబు హయాంలో పబ్లిసిటీ స్టంట్లు నడిచినప్పుడెందుకు మిన్నకున్నారు.? ఇప్పుడెందుకు ఎగిరెగిరి పడుతున్నారు.? రాజధాని సంగతి తర్వాత.. ఉద్దానం కిడ్నీ బాధితుల గోస తీర్చేందుకు ఎవరైనా చిత్తశుద్ధితో ప్రయత్నించారా.? లేదే.!

పొరుగునున్న ఒరిస్సాకీ, సుదూరాన వున్న హైద్రాబాద్, చెన్నయ్, బెంగళూరు, ముంబైలకు ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోటెత్తుతోంటే ఆపగలిగారా.? హక్కుల కోసం నినదించారా.? లేదే.! మరి ఇప్పుడెలా ఉద్యమిస్తారు.? ఏం చెప్పి, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తారు.? నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది ఉత్తరాంధ్ర నాయకుల తీరు.. అది ఏ పార్టీకి చెందిన నాయకులైనాసరే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...