Switch to English

ఢిల్లీ టైమ్స్: సింహపురి, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లు.. 37 బోగీలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సింహపురి ఎక్స్‌ప్రెస్‌, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లు.. మొత్తం 37 బోగీలతో ఢిల్లీకి వెళ్ళేందుకు సిద్ధంగా వున్నాయట. అయితే, ఇదంతా పొలిటికల్‌ వ్యవహారం కావడమే ఇక్కడ కీలకమైన విషయం. సోషల్‌ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తున్న ఓ వీడియో, కొన్ని ట్వీట్ల సారాంశాన్ని చూస్తే.. రాష్ట్రంలోని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అతి త్వరలో భారీ దెబ్బ తగలబోతోందట. వైసీపీ చెందిన దాదాపు 37 మంది కీలక ప్రజా ప్రతినిథులతో బీజేపీ టచ్‌లోకి వచ్చిందనీ, వారందర్నీ అతి త్వరలో తమవైపుకు తిప్పుకోనుందనేది ఆ ప్రచారం తాలూకు సారాంశం. నిజమేనా.? రాష్ట్రంలో ఆ పరిస్థితులు వున్నాయా.? అంటే, ప్రస్తుతానికైతే లేవని చెప్పగలంగానీ.. తెరవెనుక వ్యవహారాలు మాత్రం కొంత గందరగోళంగా వున్నాయన్నది నిర్వివాదాంశం.

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పొగపెడుతున్నారన్నది నిర్వివాదాంశం. ‘సింహమే సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయి..’ అంటూ రఘురామకృష్ణంరాజు పెద్ద బాంబే పేల్చారు. ‘నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను.. నాతోపాటు ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి..’ అని సవాల్‌ విసిరారాయన కొద్ది రోజుల క్రితం. మరోపక్క, నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డి, ‘ఏడాది పాలన పూర్తి చేసుకున్నాం.. కేకులు కట్‌ చేసి సంబరాలు చేసుకోవడం తప్ప అభివృద్ధి ఏమీ లేదు..’ అని తేల్చేసిన విషయం విదితమే. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇటీవల ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలూ పెను దుమారం రేపాయి. ఇసుక కుంభకోణం పేరుతో గుంటూరు జిల్లాకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల దుమారం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇవన్నీ బాహాటంగా జరుగుతున్నవే. ఇంత జరుగుతున్నా అధిష్టానం ఎందుకు ఈ ‘అసమ్మతిని’ కంట్రోల్‌ చేయలేకపోతోంది.? ప్రధానంగా ఇసుక విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది అధికార పార్టీలో.

తాజాగా మంత్రి విశ్వరూప్‌, తాను నిర్మిస్తోన్న ఓ ఇంటి కోసం ఇసుకని బుక్‌ చేస్తే, నాణ్యమైన ఇసుక స్థానంలో మట్టితో కూడిన ఇసుక రావడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఇళ్ళ స్థలాల విషయంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆరోపణలు ఎదుర్కోవడమే కాదు, కొందరు ప్రజా ప్రతినిథులైతే అధికారుల తీరు మీదా, ప్రభుత్వం తీరుపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, సింహపురి ఎక్స్‌ప్రెస్‌, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లు.. మాత్రమే కాదు, మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఢిల్లీ వైపు చూసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.! ఇప్పటికే టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులతోపాటు, టీడీపీ వాదనను మీడియాలో సమర్థవంతంగా విన్పించిన పలువురు కీలక నేతల్ని లాగేసిన బీజేపీ, ఇప్పుడు ‘ఆకర్ష’ మంత్రాన్ని వైఎస్సార్సీపీ మీద ప్రయోగించడమే నిజమైతే.. రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతాయ్. అయితే, రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో బీజేపీని పూర్తిగా తిరస్కరించిన దరిమిలా, అందులో దూకేంత సాహసం అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు చేస్తారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....