Switch to English

కారంచేడు ఘటనకు 35 ఏళ్లు: విరుచుకుపడ్డ కులరక్కసి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అది భూస్వామ్యం ముసుగులో కులాధిపత్యం రక్తపుటేరులు పారించిన ఓ రుధిర క్షేత్రం.. తెలుగు నేలపై సామాజిక ఉద్యమాలకు దళితులు తమ నెత్తుటితో అంకురార్పణ చేసిన ఘట్టానికి సాక్షిభూతం. అణగారిని వర్గాలను కదిలించి.. దళిత శక్తులను ఆత్మగౌరవ పతాక కిందకు తీసుకొచ్చిన ఓ దిక్సూచి కారంచేడు

కారంచేడు.. ప్రకాశం జిల్లా చీరాలకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. 35 ఏళ్ల క్రితం జరిగిన హింసాకాండ కారణంగా కారంచేడు పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. చిన్న తగాదా చినికి చినికి గాలివానగా మారి ఆరుగురు దళితుల ఊచకోతకు కారణమైంది. 1985 జూలై 17న జరిగిన ఆ మారణకాండ ఇప్పటికీ పలువురు కంట్లో అలాగే మెదులుతోంది.

కారంచేడు గ్రామంలో మొత్తం 16 వార్డులు ఉండగా.. 8 వార్డుల్లో ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందినవారు ఉండేవారు. మిగిలిన ఎనిమిది వార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారు ఉండేవారు. ప్రధాన సామాజికవర్గానికి చెందినవారు ధనవంతులు కావడంతో ఆ ప్రాంతమంతా వారి చెప్పినట్టే నడిచేది. ఈ క్రమంలో ఆ ఊరి చెరువు వద్ద జరిగిన ఓ ఘటన ఆ మరుసటి రోజు హింసకు దారితీసిందనే వాదనలున్నాయి.

1985 జూలై 16న చెరువు దగ్గర గేదెలకు కుడితె పెట్టే విషయంలో ఓ దళిత యువకుడికి, ప్రధాన సామాజికవర్గానికి చెందిన ఇరువురు వ్యక్తులకు మధ్య చిన్న ఘర్షణ జరిగింది. దీంతో మరుసటి రోజు ఉదయం మారణకాండ చోటుచేసుకుంది. దళితులపై మారణాయుధాలు, కర్రలతో దాడి చేయడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, వాస్తవంగా చనిపోయింది ఎనిమిది మంది అని.. ఇద్దరి మృతదేహాలను పోలీసులు ఎవరికీ తెలియకుండా సమాధి చేసేశారనే ఆరోపణలున్నాయి.

అనంతరం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కత్తి పద్మారావు, బొజ్జా తారకం వంటి నేతలు ఉద్యమం చేపట్టారు. దీంతో సీబీసీఐడీ విచారణ చేపట్టి 90 మందిని నిందితులుగా పేర్కొంది. అయితే, అప్పటి పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి దగ్గుబాటు చెంచురామయ్యపై కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తూ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు.

అనంతరం 1989లో చెంచురామయ్యను పీపుల్స్ వార్ హత్య చేసింది. చివరకు వాదోపదానలు విన్న తర్వాత గుంటూరు కోర్టు 1994 అక్టోబర్ 30న తీర్పు వెలువరించింది. ఐదుగురికి జీవితఖైదు, 46 మంది మూడేళ్ల జైలు శిక్ష, 65 ఏళ్లు పైబడిన నలుగురికి రూ.10వేల జరిమానా విధించింది. దీంతో శిక్ష పడినవారంతా హైకోర్టుకు వెళ్లడంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కింది కోర్టు విధించిన శిక్షలకు రద్దు చేస్తూ 1998లో తీర్పునిచ్చింది.

దీంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదేళ్ల తర్వాత 2008 డిసెంబర్ 19న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటికే పలువురు నిందితులు మరణించడంతో అంజయ్య అనే వ్యక్తికి జీవితఖైదు, మరో 29 మందికి మూడేళ్ల శిక్ష విధించింది.

కారంచేడు ఘటనకు 35 ఏళ్లు: విరుచుకుపడ్డ కులరక్కసి

ఈ మారణహోమం తర్వాత దళితులు తమ అస్థిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిలి బిగించారు. 1989లో వచ్చిన ఎస్‌సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు దేశవ్యాప్తంగా సాగిన పలు దళిత ఉద్యమాలకు కారంచేడు ఘటనే స్పూర్తి.

దళితుల సమస్యలన్నింటికి పరిష్కారం రాజ్యాధికారమే అన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నినాదాన్ని దళితుల మెదళ్లలో నింపింది. దళిత కులాల సమస్యలను సమాజంలో, ప్రభుత్వంలో చర్చకు పెట్టింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని బతికిన దళితుల్లో కారంచేడు ఘటన తర్వాత ఊహించలేనంతటి మార్పు వచ్చింది

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...