Switch to English

300 ప్లస్‌.. హైద్రాబాద్‌లో కరోనా విస్ఫోటనమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు కరోనా వైరస్‌ అదుపులోనే వుంది.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు..’ అని ప్రభుత్వం ఇప్పటిదాకా చెబుతూ వచ్చింది. మొదట్లో అయితే, కరోనా వైరస్‌ ప్రభావం అసలు తెలంగాణపై పెద్దగా వుండబోదని కూడా ప్రభుత్వం చెప్పిందిగానీ.. ఆ తర్వాత సీన్‌ మారిపోయింది. నిన్నటికి నిన్న కేవలం హైద్రాబాద్‌లోనే 300కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. పైగా, తెలంగాణలో అత్యల్పంగా జరుగుతున్న పరీక్షల్లోనే ఇన్ని కేసులు నమోదవడం అందర్నీ భయాందోళనలకు గురిచేస్తోంది.

హైద్రాబాద్‌ అంటే మెట్రో నగరం.. సుమారు కోటి మంది జనాభా జీహెచ్‌ఎంసీ పరిధిలో వున్నారు. ఈ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఒకే రోజు 300కి పైగా కేసులు నమోదవడమంటే చిన్న విషయం కాదు కదా.! ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్య చికిత్సలు షురూ అయ్యాయి.. ప్రైవేట్‌ ల్యాబ్‌లు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జనం స్వచ్ఛందంగా వైద్య పరీక్షల కోసం ముందుకొస్తున్నారు.. అటు ప్రభుత్వాసుపత్రులతోపాటు, ఇటు ప్రైవేటు ఆసుపత్రులవైపూ పరుగులు పెట్టాల్సి వస్తోంది. సీజన్‌ మారిన దరిమిలా, సాధారణ జలుబు.. జ్వరాన్ని కూడా కరోనా వైరస్‌గా అనుమానించాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో కరోనా పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరగడంతో నగరవాసి తీవ్ర భయాందోళనలకు గురవుతున్న మాట వాస్తవం.

అయితే, చాలా చోట్ల సోషల్‌ డిస్టెన్సింగ్‌ అన్న ఆలోచనే నగరవాసుల్లో కన్పించకపోవడం బాధాకరం. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణతో పోల్చితే ఎక్కువ కేసులు నమోదువుతున్నా.. అక్కడ కరోనా టెస్టులు కూడా చాలా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ స్థాయిలో తెలంగాణలో కరోనా టెస్టులు జరిగితే.. కరోనా కేసుల విస్ఫోటనం ఏ స్థాయిలో వుంటుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవడం సహజమే.

మరోపక్క, హైకోర్టు పదే పదే కరోనా వైరస్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తోంది. పరీక్షలు తక్కువగా జరుగుతుండడం, వైద్య సిబ్బందికి కరోనా సోకడంపై హైకోర్టు అక్షింతలతోపాటు, విపక్షాల నుంచీ ఒత్తిడి పెరుగుతోంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో వారం పది రోజుల్లో పెద్దయెత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించినా.. ఆ స్థాయిలో పరీక్షలు జరగడంలేదన్న విమర్శలు లేకపోలేదు.

ఇక, కరోనా మరణాలూ తెలంగాణలో చాలా ఎక్కువగా వున్నాయి ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం. ‘కేసీఆర్‌ మీడియా ముందుకొచ్చి ప్రజలకు భరోసా ఇవ్వాలి..’ అనే డిమాండ్‌ క్రమక్రమంగా పెరుగుతోంది తెలంగాణలో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...