Switch to English

మద్యాన్ని రీప్లేస్‌ చేసిన శానిటైజర్‌: ఈ ‘పాపం’ ఎవరి ఖాతాలో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘దశల వారీ మద్య నియంత్రణ – ఆ తర్వాత పూర్తిస్థాయిలో మద్య నిషేధం’ అంటూ ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో కొత్త మద్యం విధానం తీసుకొచ్చి, మద్యం ధరల్ని విపరీతంగా పెంచేసింది. ఇంకేముంది.? మందు బాబులు ‘మద్యానికి ప్రత్యామ్నాయం’ వెతుక్కుంటున్నారు. కొందరు నాటు సారా వైపు మొగ్గు చూపుతోంటే, ఇంకొందరు ప్రమాదకరమైన రసాయనాల్ని తాగేస్తున్నారు.. కరోనా పుణ్యమా అని ఇప్పుడు మార్కెట్‌లో విచ్చలవిడిగా తక్కువ ధరకే దొరికేస్తోన్న శానిటైజర్‌ని కూడా వాడేస్తున్నారు మందుబాబులు.

తాజాగా, ప్రకాశం జిల్లా కురిచేడులో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పధ్నాలుగు మంది శానిటైజర్‌ తాగి ప్రాణాలు కోల్పోయారు. శానిటైజర్‌ని తాగిన మరికొందరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన రాజకీయంగా పెను దుమారానికి కారణమవుతోంది. ‘మద్యం రేట్లు పెరిగిపోయాయ్‌.. సాయంత్రమైతే మద్యం తాగాల్సిందే.. లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది.. వేరే దారి లేక శానిటైజర్‌ తాగేస్తున్నాం..’ అంటూ శానిటైజర్‌ తాగి ప్రాణాలతో బయటపడ్డ ఓ బాధితుడు వాపోయాడు. ‘ఇదేం పోయేకాలం.?’ అని చాలామందికి అనిపించొచ్చుగాక.

మద్యానికి బానిసైతే విచక్షణ కోల్పోవడం సర్వసాధారణం. అందుకే, సంపూర్ణ మద్య నిషేధం కోసం ఎన్నో డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు కావొచ్చు, కుటుంబ తగాదాలు కావొచ్చు, ఇతరత్రా చాలా సమస్యలకు మద్యపానమే ప్రధాన కారణంగా మారుతోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలకు అత్యద్భుతమైన అవకాశం దొరికింది మద్య నిషేధం విధించడానికి. ఎటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామంటోంది కాబట్టి, ఈ సమయంలో ఆ దిశగా అడుగులేసి వుండాల్సింది. కానీ, రాష్ట్ర ఖజానా నింపుకునే క్రమంలో మద్యం ధర పెంచేసి.. ఇదిగో ఇలా మందుబాబుల్ని బలి తీసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘రాష్ట్రంలో అడ్డగోలు బ్రాండ్లతో మద్యం ఏరులై పారుతోంది.. ప్రజల్ని నిలువునా దోచేస్తున్నారు..’ అంటూ సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించడం గమనార్హం. కురిచేడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, మద్య నియంత్రణ పట్ల వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నాటు సారా ఏరులై పారుతోంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు జనసేన అధినేత. డి-ఎడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, మద్య నియంత్రణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌. మరోపక్క, టీడీపీ సహా ఇతర రాజకీయ పార్టీలు కురిచేడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...