టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ గత నెల 30వ తారీకున గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. మూడు నాలుగు రోజుల పాటు పెళ్లి హడావుడిలో ఉన్న కాజల్ అగర్వాల్ నిన్న కాస్త సమయం చిక్కడంతో సోషల్ మీడియాలో తన పెళ్లి తాళూకు ఫొటోలు మరియు మెమోరీస్ విశేషాలను షేర్ చేసుకుంది. ఈ సందర్బంగా కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఒక ఫొటోలో వధు వరులు ఇద్దరు జిలకర బెల్లం పెట్టుకుంటున్నారు. పంజాబీ అయిన కాజల్ మరియు కశ్మీరి అయిన గౌతమ్ ల పెళ్లి సాంప్రదాయాల్లో ఈ జిలకర బెల్లం కాన్సెప్ట్ ఉండదు. కాని సౌత్ సాంప్రదాయం బాగా నచ్చడం వల్ల కాజల్ ఈ పద్దతిలో తన పెళ్లి చేసుకున్నట్లుగా అనిపిస్తుంది.
సౌత్ లో ఎన్నో సినిమాల్లో పెళ్లి సన్నివేశాల్లో నటించిన కాజల్ కు ఇక్కడి పెళ్లి సాంప్రదాయం బాగా నచ్చిందేమో అందుకే ఆమె ఇలా పెళ్లి వేడుకను చేసుకుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ హీరోయిన్ అయినందుకు సౌత్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం నిజంగా అభినందనీయం అంటూ అభిమానులు అంటున్నారు. సౌత్ ఇండియన్ హిందూ సాంప్రదాయంతో పాటు ఉత్తరాది హిందూ సాంప్రదాయంను కూడా కలిపి ఈ పెళ్లిని పెద్దలు నిర్వహించినట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి కాజల్ అగర్వాల్ పెళ్లితో ఆమె అభిమానుల్లో ఆనందం కనిపిస్తుంది.
కాజల్ కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లి కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కాజల్ చెల్లి అయిన నిషా అగర్వాల్ చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. హీరోయిన్ గా స్టార్ హోదాలో ఉండి బిజీగా ఉన్న సమయంలో పెళ్లి చేసుకోవడం అనేది కెరీర్ ను నాశనం చేసుకున్నట్లుగా అవుతుందని భావించి కాజల్ అగర్వాల్ పెళ్లిని వాయిదా వేసుకుంది. చెల్లి కొడుకును ఆడిస్తూ ఉన్న కాజల్ పెళ్లి విషయంలో ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు తన ప్రియుడు గౌతమ్ తో మూడు ముడులు వేయించుకుని ఏడు అడుగులు నడిచింది.
291266 233683Most appropriate the human race messages work to show your and present exclusive chance with particular couple. Beginer appear system in advance of raucous individuals will most likely always be aware most of the golden value off presentation, which is actually a persons truck. finest man jokes 225520
311224 275383This web page is often a walk-through its the internet you wanted about this and didnt know who to question. Glimpse here, and youll completely discover it. 843019
935134 798454Thanks for some other great post. Where else might just anyone get that type of info in such an ideal indicates of writing? Ive a presentation next week, and Im at the search for such information. 51122
197825 491157Sweet website , super pattern , rattling clean and use friendly . 191059