Switch to English

నిమ్మగడ్డ రాజకీయం.. వైసీపీ కసి తీరలేదింకా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనేమో. ఆయనకి ఎలాగైనా రాజకీయ రంగు పులిమెయ్యాలని అధికార వైసీపీ చాలా గట్టిగానే ప్రయత్నిస్తోంది. నిజానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వల్ల పరోక్షంగానే అయినా లబ్ది పొందింది మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. నిమ్మగడ్డ హయాంలోనే టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలపై వైసీపీ నేతల దాడి జరిగింది. నిమ్మగడ్డ ఎస్ఈసీగా వున్నప్పుడే స్థానిక ఎన్నికల్లో అత్యంత జుగుప్సాకరమైన పరిణామాలు జరిగాయి. బలవంతపు ఏకగ్రీవాలు సహా.. నానా యాగీ జరిగింది. అయితే, దానంతటికీ నిమ్మగడ్డ కారణమని చెప్పగలమా.? అన్నది వేరే చర్చ.

నిమ్మగడ్డ స్థానిక ఎన్నికల్ని కరోనా కారణంగా వాయిదా వేయడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. కానీ, తద్వారా వైసీపీకి జరిగిన నష్టమేమీ లేదు. టీడీపీకి వంత పాడారనో, బీజేపీకి వంత పాడారనో నిమ్మగడ్డపై ఇంకా ఆరోపణలు చేయడం వల్ల వైసీపీకి ఒరిగేదేంటట.? ఒకవేళ నిమ్మగడ్డ.. ఆ రెండు పార్టీలకు అనుకూలంగా పని చేసి వుంటే, స్థానిక ఎన్నికల ఫలితాలు ఇంకోలా వుండేవన్నది సాధారణ ప్రజానీకంలో జరుగుతున్న చర్చ.

నిమ్మగడ్డ మీద పచ్చ ముద్ర వేసేసి, నిస్సిగ్గుగా అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టారు. ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాల్ని ఆపేస్తామని ఓటర్లను బెదిరించారు. ఇక, నేటితో నిమ్మగడ్డ పదవీ కాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక ఎన్నికల విషయమై కొన్ని సూచనలు చేశారు. అది ఆయన బాధ్యత. కానీ, ‘తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాసినట్టుంది..’ అటూ ఓ మంత్రి వెంటకారం చేయడం అత్యంత జుగుప్సాకరం.

ఏం, రాజకీయ నాయకులు.. ప్రజల్ని దోచేసుకుని, ‘అవినీతి రహిత సమాజం కోసం’ అంటూ మాట్లాడటంలేదా.? అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయినోళ్ళు అధికార పీఠమెక్కి.. చట్టాలు చేస్తూ, ప్రజల్ని వెర్రి వెంగళప్పల్ని చేయడంలేదా.? ఏమో, వైసీపీ తీరు చూస్తోంటే, ఎలాగోలా నిమ్మగడ్డను ఏదో పార్టీలో చేర్పించేలానే వుంది. ఎటూ టీడీపీతో 60-40 ఒప్పందాలు తెరవెనుక నడుస్తున్నాయి కదా.. వైసీపీ చలవతో, నిమ్మగడ్డను టీడీపీలోకి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయేమోన్నది చాలామంది డౌటానుమానం.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...