మెగాస్టార్ చిరంజీవి ఎంత గొప్పోడంటే.. అంటూ బులుగు పచ్చ మీడియా.. మరీ ముఖ్యంగా ప్రస్తుతానికి బులుగు మీడియా చాలా చాలా కష్టపడి కథనాల్ని వండి వడ్డించేస్తోంది. మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు పలికారు.. సినీ పరిశ్రమ సమస్యల విషయంలో వైఎస్ జగన్ సర్కారు ముందు చేతులు జోడించి మరీ తమను ఆదుకోమని కోరారు.. ఇలాంటివన్నీ వైసీపీ మద్దతుదారులకీ, వైసీపీ నేతలకీ, బులుగు మీడీయాకీ మహదానం కలిగించాయి.
ఇదే చిరంజీవిని గతంలో చాలాసార్లు తూలనాడినోళ్ళు ఇప్పుడు చిరంజీవిని మహానుభావుడిగా చూసేస్తున్నారు. ఏంటిదంతా.? ఇదంతా చిరంజీవి మీద ప్రేమాభిమానాలేనా.? చిరంజీవి పట్ల వారికి మరీ అంత గౌరవం ఎక్కువైపోయిందా.? నిజంగానే చిరంజీవిలోని మహానుభావుడు వీళ్ళందరికీ కనిపిస్తున్నాడా.?
పచ్చకామెర్లున్నోడికి లోకమంతా పచ్చగా కనపిస్తుందో లేదోగానీ.. బులుగు పైత్యం వున్నోడికి మాత్రం లోకమంతా ‘బులుగు’ మయంగానే కనిపిస్తుంది.. వేరే రంగులు కనిపించవు. ప్రస్తుతానికి చిరంజీవిలో మంచిని చూస్తున్నదీ ఆ బులుగు కోణంలో మాత్రమే.
ఇక్కడ చిరంజీవిని పొగడటం ద్వారా పవన్ కళ్యాణ్‌ని తెగడటమే బులుగు అజెండా. ‘మీ అన్నని చూసి నేర్చుకోండి..’ అంటూ పవన్ కళ్యాణ్‌కి బులుగు పేటీఎంగాళ్ళు ఉచిత సలహాలిచ్చేస్తూ వెటకారాలు చేసేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఎప్పుడూ వేర్వేరు కాదు. ఇది గతంలో పలుమార్లు నిరూపితమయ్యింది.
అన్నయ్య చిరంజీవి ఓ శిఖరం అని పవన్ కళ్యాణ్‌కి తెలుసు. తమ్ముడి పట్టుదల ఏంటో చిరంజీవికి తెలుసు. ఈ ఇద్దర్నీ ఎలాగైనా విడదీయాలని అన్నదమ్ముల మధ్య చిచ్చపెట్టేందుకు గతంలో టీడీపీ చేసిన ప్రయత్నాలకు మించి, దుష్ట పన్నాగాలు వైసీపీ నుంచి నడుస్తున్నాయంతే.
సినీ పరిశ్రమ కోసం పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డతారు.. అదే సినీ పరిశ్రమ కోసం అవసరమైతే చేతులు జోడించి నమస్కరించడంలో తప్పేమీ లేదని చిరంజీవి అనుకున్నారు. ఇద్దరి లక్ష్యం ఒకటే. దారులు మాత్రమే వేరు. అయినా, వసుదేవుడంతటోడే గాడిద కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోతే ఎలా.?
385282 521496I always was concerned in this topic and stock nonetheless am, regards for posting . 367236
842982 500946some truly interesting info , effectively written and broadly speaking user genial . 725549
454453 87002I believe this internet site contains some extremely excellent information for everybody : D. 357130
388711 301166Hello I found the Free of charge Simple Shopping Icons Download | Style, Tech and Internet post quite intriguing therefore Ive included our track-back for it on my own webpage, continue the wonderful job:) 527809
460786 116341Keep up the great work , I read few weblog posts on this internet site and I believe that your website is real interesting and has bands of excellent information . 222746
Wow cuz this is excellent job! Congrats and keep it up. [url=http://sum24.khome24.kr/bbs/board.php?bo_table=free&wr_id=171575]cetirizine rezeptfrei erhältlich in Paris[/url]