Switch to English

తప్పు చెయ్యకపోతే వైసీపీకి అంత భయమెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మహిళ అని చూడకుండా ఓ అభ్యర్థి మీద దాడి చేసి, ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ, ఆమె దాచుకున్న నామినేషన్ పత్రాల్ని చింపేశాడో వైసీపీ నేత. ఓ వృద్ధుడిని రక్తమొచ్చేలా కొట్టి అతనిచేత నామినేషన్ ఉపసంహరించేలా చేయడానికి ప్రయత్నంచాడు మరో వైసీపీ నేత. ఇళ్ళ మీద దాడులకు వెళ్ళడం.. చిన్న పిల్లలపై దాడులు చేయడం.. ఒకటా.? రెండా.? పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఇలాంటి ఘటనలు జరిగాయి. గత ఏడాది స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయిన తరుణంలో తలెత్తిన రావణ కాష్టమిది.

అప్పట్లో పరిస్థితి తీవ్రతను చూసి చలించిపోయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఏమయ్యిందోగానీ, ఇప్పుడు ఎస్ఈసీ ‘ఆల్ ఈజ్ వెల్’ అనే మంత్రం జపిస్తున్నారు. పంచాయితీ ఎన్నికల వేళ బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి.. ఓటుకి వెయ్యి రూపాయల నుంచి 10 వేల రూపాయల దాకా ధర పలికింది. కొన్ని చోట్ల ఏకగ్రీవాల కోసం 50 నుంచి 60 లక్షలదాకా ఖర్చు చేశారు అధికార పార్టీ మద్దతుదారులు. ఇవన్నీ కళ్ళముందు కనిపిస్తున్నవే. అయినాగానీ, అంతా ప్రశాంతం.. అన్నది ఎస్ఈసీ వాదన.

ఇక, మున్సిపల్ ఎన్నికలు.. పరిషత్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. గతంలో ఎక్కడైతే ప్రక్రియ ఆగిందో, అక్కడి నుంచే మళ్ళీ ప్రక్రియ మొదలవుతుందట. ఇదెక్కడి న్యాయం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ‘బలవంతపు నామినేషన్ల ఉప సంహరణకు సంబంధించి ఆధారాలు చూపిస్తే, ఇంకో అవకాశం’ అంటోంది ఎస్ఈసీ. ‘తూచ్, అలా కుదరదు..’ అని అధికార పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అక్కడికేదో ఎస్ఈసీ, అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రొజెక్షన్ జరుగుతోందంతే. కానీ, తెరవెనుకాల కథ వేరేలా వుంది.

‘నాకు వైఎస్సార్ అంటే చాలా అభిమానం..’ అని సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పడమేంటి.? ‘నేను తిట్టినట్లు నటిస్తాను.. నువ్వు ఏడ్చినట్లు నటించు..’ అన్నట్టుంది వైసీపీ, ఎస్ఈసీ వ్యవహారం.. అన్నది తెరపైకొస్తున్న కొత్త అనుమానం. అయినా, పంచాయితీ ఎన్నికల్లో 80 శాతం పైగా స్థానాలు తామే గెలిచామని చెప్పకుంటోన్న వైసీపీకి, కొత్తగా మళ్ళీ పరిషత్, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయితే వచ్చే నష్టమేంటట.? అంటే, గతంలో తాము అడ్డగోలు చర్యలకు పాల్పడ్డామనీ, అవన్నీ ఇంకోసారి చేయాల్సి వస్తే.. అదనపు ఖర్చు దండగ అనీ వైసీపీ చెప్పకనే చెబుతున్నట్లే కదా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....