నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుని వైసీపీ ఎంపీగా గుర్తించారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ‘ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసినందుకు అధికార పార్టీ ఎంపీ అని చూడకుండా అరెస్టు చేసిన పోలీసులను అభినందించాల్సింది పోయి, పచ్చ పార్టీ డొల్ల వాదనలు చేస్తోంది. అంతలా అభిమానించేవాళ్ళు ఇన్నాళ్ళూ నోరు జారుతుంటే ఒక్కరైనా వారించారా.? అయినా కరోనా వచ్చిందని పోలీసులు పని చేయకూడదా.?’ అంటూ అమాయకంగా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించేశారు విజయసాయిరెడ్డి.
ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే అరెస్టు చేసెయ్యాలట. ఇదెక్కడి చోద్యం.? రాజకీయాలన్నాక ఆరోపణలు సహజాతి సహజం. చంద్రబాబు హయాంలో వైసీపీ చేసిన ఆరోపణల మాటేమిటి.? ఎక్కడిదాకానో ఎందుకు, చంద్రబాబే.. వైఎస్ వివేకానందరెడ్డిని చంపించారంటూ వైసీపీ ఆరోపించింది. మరి, వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుపై ఈ కేసుకి సంబంధించి చర్యలు తీసుకుందా.? ప్రశ్నించుకుంటూ పోతే చాలానే వుంటాయి. అప్పటి టీడీపీ నేతల్లో చాలామంది ఇప్పుడు వైసీపీ నేతలు. పార్టీ మారగానే, ఆయా నేతలు కడిగిన ముత్యాలైపోయారా.? అయినా, సొంత పార్టీ ఎంపీని అరెస్టు చేయడాన్ని ఘనకార్యంగా చెప్పుకోవడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ఓ ఎమ్మెల్యే, ఓ జర్నలిస్టు ఇంటికి వెళ్ళి బెదిరిస్తాడు. ఇంకో మంత్రి.. మీడియా సాక్షిగా బూతులు తిడతాడు. ఓ మంత్రి, ఓ సామాజిక వర్గాన్ని కించపర్చుతాడు. ముఖ్యమంత్రి సాక్షాత్తూ, ఎన్నికల కమిషనర్ పదవిలో వున్న వ్యక్తికి కులాన్ని ఆపాదిస్తారు.. ఇవన్నీ ఏంటి.? అన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రశ్న. పోలీసు వ్యవస్థ అందరి విషయంలోనూ ఒకేలా వ్యవహరించాలి. వైసీపీ మీద, అధికార పార్టీ నేతల మీదా సోషల్ మీడియాలో కామెంట్లు పెడితే వెంటనే అరెస్టులు జరుగుతాయ్.. అదే విపక్షాలకు చెందిన నేతల మీద ఎంతటి జుగుప్సాకరమైన రాతలు రాసినా చర్యలుండవ్.. ఎందుకిలా.? పోలీసులు ఏపీలో ఎలా పనిచేస్తున్నారన్నది కోర్టులు పదే పదే తెలియజేస్తూనే వున్నాయ్.
801607 77556Thanks for the information. And a response from you. car dealers hips san jose 848862
957338 777860Perfectly indited content material , thanks for selective information . 809109
962251 117468truly very good post, i definitely love this internet site, keep on it 77044
586858 458917I believe this website has got some quite outstanding info for everyone : D. 108464
280007 123626Glad to be 1 of numerous visitants on this awing internet site : D. 898329
949250 201222Merely a smiling visitor here to share the adore (:, btw wonderful pattern . 62179