తండ్రి మరణం ఆయన్ను కలచివేసింది.. ఆ అ’జెండా’ని పట్టుకుని జనంలోకి వెళ్ళారాయన. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిననవారికి అండగా వుండేందుకు ప్రయత్నించారు.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఆయన స్పందించారు. దాదాపు అందరి ఇళ్ళకూ వెళ్ళారు. ఆయనేనా, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యింది.? అని అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.
అవును, ఆయనకి మరణం తాలూకు విలువ తెలుసు. కానీ, అప్పటి ఆయన వేరు.. ఇప్పటి ఈయన వేరు. అవును, మనిషి మారారు.. కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకున్నారు. అప్పుడేమో ప్రజలకు సేవకుడినని చెప్పారు. ఇప్పుడేమో.. నిఖార్సయిన పాలకుడినని నిరూపించుకుంటున్నారు.
అసెంబ్లీలో ఈ మధ్యనే ఓ సందర్బంలో ‘మేం సేవకులం’ అని వైఎస్ జగన్ చెప్పుకున్నారుగానీ, సేవకుడి లక్షణం ఒక్కటీ ఆయనలో కన్పించడంలేదు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా చాలామంది భవన నిర్మాణ రంగ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. విపక్షాలు ఆ అంశంతో పబ్లిసిటీ స్టంట్లు చేసి వుండొచ్చుగాక. కానీ, జనం ప్రాణాలు కోల్పోయిన మాట నిజమే కదా.!
ఇప్పుడు, అమరావతిలో మరణ మృదంగం కన్పిస్తోంది. ‘మేం ప్రభుత్వానికి భూముల్ని త్యాగం చేయడమే మేం చేసిన పాపమా.?’ అని రోదిస్తూ రైతులు, రైతు కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. దురదృష్టవశాత్తూ ప్రభుత్వానికి ఇలాంటి మరణాలేవీ కన్పించడంలేదు. ఒకప్పటి వైఎస్ జగన్ అయి వుంటే, ఇప్పుడు ఇంకేదన్నా ప్రభుత్వం అధికారంలో వుండి వుంటే.. జగన్.. ఆ జనంలోనే వుండేవారు. అమరావతి ప్రజలకు మద్దతుగా వైఎస్ జగన్ నిలబడేవారు.. ప్రభుత్వాన్ని ఎదిరించేవారు. అదే పాలకుడికీ – సేవకుడికీ తేడా.
రాజ్యాంగం గురించీ, ప్రజాస్వామ్యం గురించీ గణతంత్ర దినోత్సవ సందేశంలో బహు చక్కగా చెప్పారు వైఎస్ జగన్. కానీ, ఏదీ ఆ ప్రజాస్వామ్యం.? మహిళల కీళ్ళు విరగ్గొట్టి, రైతుల వెన్ను విరిచి.. అమరావతి గుండెల్లో పోలీసుల కవాతు చప్పుళ్ళు మార్మోగుతోంటే.. దీన్ని ప్రజాస్వామ్యమందామా.?
698067 663271quite very good post, i definitely enjoy this outstanding site, keep on it 144934
570559 338743Pretty part of content material. I just stumbled upon your weblog and in accession capital to assert that I get truly loved account your weblog posts. Any way Ill be subscribing on your feeds or even I success you access constantly quick. 831501
988507 891783I need to admit that that is one wonderful insight. It surely gives a company the opportunity to have in about the ground floor and truly take part in creating a thing particular and tailored to their needs. 734545