నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది బులుగు రాజకీయం. అధికార వైసీపీ, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ గడచిన రెండేళ్ళుగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వుంది. అర్థం పర్థం లేని వాదనతో రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేసేశారు. మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినప్పుడే, అది చెల్లదనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమయ్యింది. అదే ఇప్పుడు నిజమయ్యింది. ప్రభుత్వమే, ఆ బిల్లుని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, అబ్బే.. ఇది ఇంటర్వెల్ మాత్రమే.. అంటూ మూడు రాజధానులకు కట్టుబడి వున్నామని కొత్త కథ చెబుతోంది అధికార వైసీపీ. ఇదెక్కడి వితండ వాదన.? హైద్రాబాద్ అభివృద్ధి చెందింది గనుక, అక్కడ వేర్పాటువాదం పుట్టిందట. అదే నిజమైతే, హైద్రాబాద్ ప్రాంతంలో కూడా అలాంటి విభజన వాదమే రావాలి కదా.?
చెన్నయ్ విషయంలో లేని విభజన వాదన, బెంగళూరు విషయంలో లేని విభజన వాదన.. ముంబై విషయంలో లేని విభజన వాదన.. కేవలం హైద్రాబాద్ విషయంలో ఎందుకొచ్చిందో ఏమో.! ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మూడు రాజధానుల విషయమై ‘కవర్ డ్రైవ్’ బాగానే చేశాననుకుంటున్నారుగానీ, అక్కడ క్లీన్ బౌల్డ్ అయిపోయారాయన.
మూడు రాజధానులనేది తర్వాతి విషయం. అసలు, గడచిన రెండున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు విశాఖపట్నం, ఇటు కర్నూలు, ఇంకోపక్క అమరావతి.. వీటితోపాటుగా.. చిన్నా పెద్ద నగరాలు, పట్టణాలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి పరంగా.?
అభివృద్ధి సంగతి పక్కన పెడదాం. కనీసం, గడచిన రెండున్నరేళ్ళలో పాడైపోయిన రోడ్లకు సరైన రీతిలో మరమ్మత్తులు అయినా చేయగలిగారా.? లేదాయె. రోడ్ల మీద గుంతల్ని పూడ్చలేకపోతున్న ప్రభుత్వం, రాష్ట్రానికి మూడు రాజధానులు తెచ్చేస్తుందా.? నలుగురు నవ్విపోతున్నారన్న సోయ అధికారంలో వున్నవారికి లేకపోతే ఎలా.?
99560 366312This really is how to get your foot in the door. 739335
474429 115886Depending on yourself to make the decisions can genuinely be upsetting and frustrating. It takes years to build confidence. Frankly it takes more than just happening to happen. 16001
643231 30095Amaze! Thank you! I constantly wished to produce in my internet website a thing like that. Can I take element with the publish to my blog? 587490
131208 32469I really dont accept this particular article. Nonetheless, I had searched with Google and Ive located out that you are correct and I had been thinking within the improper way. Keep on creating top quality material similar to this. 342899
450475 732997Attractive portion of content material. I merely stumbled upon your weblog and in accession capital to assert that I get in fact loved account your weblog posts. Anyway I will be subscribing to your augment and even I success you get admission to constantly rapidly. 687672