Switch to English

మద్య నిషేధమా.? అంటే ఏంటి.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మద్య నిషేధం అంటే ఏంటి.? అని అమాయకంగా రేప్పొద్దున్న వైసీపీ నేతలు ‘నటించినా’ ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అధికారంలోకి రాగానే, వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించేశారు. అధికారంలోకి వచ్చాక, ‘సీపీఎస్ రద్దు వల్ల ప్రయోజనం లేదు..’ అంటూ వింత వాదనకు తెరలేపింది వైసీపీ.

రాజకీయ నాయకులకు రెండు నాల్కలుంటాయ్. కాదు కాదు, రెండు లక్షల నాల్కలుంటాయ్. ఏది ఎప్పుడు ఎలా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. కేంద్రం మెడలు వంచేసి ప్రత్యేక హోదా తెస్తామన్న వైసీపీ, అదే కేంద్రం ముందు తమంతట తాముగా మెడలు విరిచేసుకుని కూర్చుంది. ఎందుకిలా.? అని ప్రశ్నిస్తే, ‘చంద్రబాబు చేసిందేంటి.?’ అని ఎదురు ప్రశ్నించడం వైసీపీకే చెల్లింది. అయితే, టీడీపీని మూలన కూర్చోబెట్టినట్లు వచ్చే ఎన్నికల్లో వైసీపీని కూడా మూలన కూర్చోబెట్టెయ్యాలన్నమాట.. అని జనం డిసైడ్ అవ్వాల్సిందే.

మద్య నిషేధం విషయానికొస్తే, ఎన్ని కబుర్లు చెప్పారు.? ఇప్పుడు ఎన్ని వికృత చేష్టలు చేస్తున్నారు. మద్యం దుకాణాల దగ్గర టీచర్లను కాపలా పెట్టిన ఘన చరిత్ర వై‘ఛీప్’ సర్కారుది. అది గతం. ప్రభుత్వమే మద్యం దుకాణాల్ని నిర్వహిస్తూ, మద్య నిషేధం ఊసెత్తడంలేదు.

రాష్ట్రంలో బార్ల లైసెన్సుల్ని మళ్ళీ పొడిగించారు. సో, రాష్ట్రంలో మద్య నిషేధం అన్న ఊసే భవిష్యత్తులో వుండబోదన్నమాట. సీపీఎస్ రద్దు విషయంలో ఎలాగైతే వైఎస్ జగన్ అవగాహనా రాహిత్యంతో ప్రకటన చేశారో (అలాగని స్వయానా వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల సెలవిచ్చారు), మద్య నిషేధం విషయంలో కూడా అంతే అవగాహనా రాహిత్యంతో వైఎస్ జగన్ ఎన్నికల హామీ ఇచ్చారన్నమాట.

మధ్యలో జనమే వెర్రి వెంగళప్పలన్నమాట.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటల్ని నమ్మినందుకు. నమ్మితే నట్టేట్లో మునిగిపోవాలని తెలియక జనం వైసీపీకి ఓట్లేశారా.? తెలిసీ వైసీపీ అనే బురదలోకి దిగారా.?

మొత్తమ్మీద, మద్యం మీద వచ్చే ఆదాయంపై వైసీపీ సర్కారు తన మమకారం చంపుకోలేకపోతోందన్నమాట. ఇక్కడ వైసీపీకి రెండు ప్రయోజనాలున్నాయ్.. అందులో అతి ముఖ్యమైనది, తమవైన సొంత అడ్డగోలు బ్రాండ్లను జనం మీద రుద్దేయొచ్చు.. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలూ చేయొచ్చు.!

దీన్ని పరిపాలన అంటారా.? వ్యాపారమంటారా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....