Switch to English

చేతులెత్తేసిన ఏపీ సర్కార్: డబ్బుల్లేవ్.. మేమేటి సేత్తాం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కరోనా పాండమిక్ నేపథ్యంలో రాష్ట్రాలు అప్పులు చేయడం వింతేమీ కాదు. ఎక్కడ అప్పు దొరికితే అక్కడ పండగ చేసుకోవడం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలకు వేరే మార్గం లేదు. కేంద్రం కూడా అదే పని చేస్తోంది. రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ, మరిన్ని అప్పలు చేయడానికి కేంద్రమూ తనదైన వ్యూహాలకు పదును పెడుతోంది.

ధనిక రాష్ట్రం తెలంగాణ కూడా అప్పులు చేస్తున్నప్పుడు, రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ అప్పుల బాధతో సతమతమవుతున్న 13 జిల్లాల ఆంధ్రపదేశ్ ఎందుకు కొత్త అప్పులు కొత్త కొత్తగా చెయ్యదు.? కానీ, ఓ పక్క తమ పాలన అద్భుతం.. స్వర్ణయుగం.. అంటూ పబ్లిసిటీ చేసుకుంటూ, ఇంకోపక్క నెల వారీ అప్పుల స్థాయి దాటేసి, రోజువారీ అప్పులనేలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్పులు చేస్తోంటే విమర్శలు రాకుండా వుంటాయా.?

ఈ వ్యవహారంపై పెద్దయెత్తున దుమారం చెలరేగుతోంటే, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ‘బుడగ’ పేల్చేశారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు చేయకపోతే కష్టమని తేల్చేశారు. ప్రజల్ని ఆదుకోవాలంటే అప్పులు చేయడమే మార్గమన్నారు. మరి, చంద్రబాబు హయాంలో అప్పులు జరిగినప్పుడు ఎందుకు విమర్శించారయ్యా.? అంటే, బుగ్గన దగ్గరే కాదు, వైసీపీ నేతలెవరిదగ్గరా సమాధానం దొరకదు.

సంక్షేమ పథకాల విషయంలో ఎప్పటికప్పుడు రికార్డుల గురించి చెప్పుకుంటున్న జగన్ సర్కార్, ఈ అప్పుల రికార్డుల గురించి కూడా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటే బావుంటుందేమో. గత కొన్ని నెలలుగా ఉద్యోగస్తులకు జీతాలు మొదటి తారీఖున అందడం గగనమైపోయింది. కానీ, సంక్షేమ పథకాల పబ్లిసిటీ మాత్రం ఆగడంలేదు.

రాష్ట్ర చరిత్రలో ఈ నెల అత్యంత భారంగా గడుస్తోందనే అభిప్రాయం, రాష్ట్ర పరిస్థితిని విశ్లేషిస్తోన్న ఆర్థిక రంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. మరి, వచ్చేనెల పరిస్థితి ఎలా వుండబోతోంది.? కేంద్రేమో.. అవసరానికి మించి రాష్ట్రం అప్పులు చేస్తోందని.. సామర్థ్యానికి మించి అప్పులు చేసేసిన దరిమిలా, కొత్త అప్పులు చేయడం కుదరదంటూ రాష్ట్రానికి తేల్చి చెప్పిందాయె. కానీ, ఆ అప్పులే లేకపోతే, రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదాయె.

గత రెండేళ్ళుగా రాష్ట్రంలో అభివృద్ధి పడకేసింది. రాజధాని లేని రాష్ట్రం.. అప్పులతో ఎన్నాళ్ళు నెట్టుకురాగలుగుతుంది.? సొంత పబ్లిసిటీనే మస్ట్.. రాష్ట్ర రాజధాని వేస్ట్.. అన్నట్టు ఆలోచన చేస్తోన్న అధికార వైసీపీ, ముందు ముందు ప్రజల్ని ఇంకెంతలా ముంచేస్తుందో ఏమో.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...