Switch to English

శశికళ విడుదల డిసైడైపోయిందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

శశికళ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత ఇష్ట సఖి. అక్రమ ఆస్తుల కేసులో కర్ణాటక జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అప్పట్లో కొన్ని రాజకీయ లెక్కల కారణంగా ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. శశికళకు నాలుగేళ్ల శిక్ష పడగా.. 2017 ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నారు. అది వచ్చే ఏడాది ఫిబ్రవరికి ముగియనుంది. అయితే, అంతకంటే ముందుగానే వచ్చేనెల 14కి శశికళ విడుదల అవుతారంటూ బీజేపీ సీనియర్ నేత ఆశీర్వాదం ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అసలు ఏ లెక్కన ఆమె ఆరు నెలల ముందుగా విడుదల అవుతారనే విశ్లేషణలు సాగాయి. సత్ప్రవర్తన, ఇతర అంశాల ప్రాతిపదికన ఆగస్టు 15నాటికి ఖైదీలను విడుదల చేసే సంప్రదాయం ఉంది కదా? అందులో భాగంగా శశికళ విడుదలయ్యే అవకాశం ఉందన్నది వాటి సారాంశం.

అయితే, ఇక్కడ సత్ప్రవర్తన ఒక్కటే కాకుండా రెమిషన్ వంటి ఇతర అంశాలూ పరిగణనలోకి తీసుకుంటారు. ఇది ఆయా రాష్ట్రాల జైళ్ల శాఖ నిబంధనల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏ ఖైదీలైనా తమ శిక్షా కాలంలో మూడింట రెండొంతుల శిక్షా కాలం అనుభవిస్తే వారికి రెమిషన్ వర్తిస్తుంది. ఇప్పటివరకు శశికల 40 నెలల 16 రోజుల శిక్ష అనుభవించారు. అంతకుముందు 1996లో 13 రోజులు, 2004లో 22 రోజులు జైలులో ఉన్నారు. అది కూడా లెక్కలోకి వస్తుంది. ఒకవేళ పెరోల్ మీద బయట ఉంటే ఆ రోజులు మైనస్ చేస్తారు. శిక్షాకాలంలో శశికల మొత్తం 20 రోజులపాటు పెరోల్ పై ఉన్నారు.

ఇక కర్ణాటక జైలు నిబంధనల ప్రకారం ఖైదీలు ఎవరైనా కన్నడం నేర్చుకుంటే వారికి నెలకు 6 రోజుల రెమిషన్ లభిస్తుంది. అంటే ఏడాదికి 72 రోజులు. ఆ లెక్కన శశికళకు 240 రోజుల రెమిషన్ వర్తిస్తుంది. ఈ లెక్కడ తొమ్మిది నెలల ముందే ఆమె విడుదల కావడానికి మార్గం ఏర్పడింది. ఇదే విషయాన్ని ఆమె లాయర్ ఎన్. రాజా సెంధూర్ పాండియన్ వివరించారు. గతేడాది డిసెంబర్ నాటికే ఆమెకు విడుదలయ్యేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. తాను ఈ విషయంపైనే పోరాడుతున్నట్టు చెప్పారు. కోర్టు అడిగితే పూచీకత్తు ఇచ్చేందుకు వీలుగా రూ.10 కోట్లు కూడా సిద్ధంగా ఉంచుకున్నట్టు చెప్పారు.

అయితే, తనకు జైలులో అన్ని రకాల వసతులు కల్పించేందుకు జైలు అధికారులకు శశికళ లంచం ఇవ్వడానికి ప్రయత్నించారంటూ ఐపీఎస్ అధికారి రూపా మౌడ్గిల్ చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. కానీ ఈ వ్యవహారంపై ఏర్పాటైన కమిటీ అలాంటిది ఏమీ జరగలేదని నివేదిక ఇచ్చినట్టు సెంధూర్ తెలిపారు. కర్ణాటక జైలు నిబంధనలు, రెమిషన్లు.. ఇలాంటివన్నీ పక్కనపెడితే, ఆమె విడుదల పూర్తిగా రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రభుత్వ పెద్దలు తలుచుకుంటే ఆమె విడుదలకు ద్వారాలు తెరుచుకున్నట్టే. పైగా ఆమెకు అనుకూలంగా బీజేపీ నేతల స్టేట్ మెంట్లు రావడం గమనార్హం. శశికళ ఆగస్టు 14న విడుదల కావడం ఖాయమని ఆశీర్వాదం ట్వీట్ చేయగా.. బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సైతం శశికళ పట్ల సానుకూలంగానే మాట్లాడటం విశేషం. శశికళ విడుదలైతే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని ఇటీవల స్వామి వ్యాఖ్యానించారు. రాజకీయాలను, ఆమెను వేరుగా చూడటం కుదరదన్నారు. ఆమెకు అద్భుతమైన ప్రతిభ ఉందని, చాలామంది ఆమె వెన్నంటి ఉండటం ఖాయమని పేర్కొన్నారు.

అయితే, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఏదైనా కేసులో శిక్ష అనుభవించిన వ్యక్తి కనీసం ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో ఆమె వెనకుండి రాజకీయాల్ని నడిపిస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఆమె రాకను ప్రస్తుత తమిళనాడు సీఎం పళనిస్వామి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...