Switch to English

జస్ట్ ఆస్కింగ్: పోలవరం ప్రాజెక్టు.. ఇవన్నీ వాస్తవాలేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి స్పిల్ వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. స్పిల్ ఛానల్ పనులు కూడా దాదాపు ఓ కొలిక్కి వచ్చేశాయి.. ఇంకోపక్క కఫర్ డ్యామ్ సహా అనేక కీలకమైన పనులు అత్యంత వ్యూహాత్మకంగా, శరవేగంగా జరుగుతున్నాయి.. ఇదీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం తాలూకు సారాంశం. ఈసారి వరద వస్తే, నీటిని ప్రస్తుతం వున్న ప్రవాహంలా కాకుండా, ప్రవాహం దారి మళ్ళించి గేట్ల గుండా పంపించబోతున్నారట.

వినడానికి ఎంత అద్భుతంగా వుందో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ విషయాలపై మీడియా కథనాలు వస్తోంటే. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా.? లేదా.? అన్న అనుమానాల నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది. పోలవరం, ఆంధ్రపదేశ్ ప్రజల జీవనాడిగా అభివర్ణిస్తుంటారు రాజకీయ పరిశీలకులు. అది నిజం కూడా. అందుకే, బ్రిటిష్ హయాంలోనే ఈ ప్రాజెక్టు ఆలోచన జరిగింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పనులు ప్రారంభమయ్యాయిగానీ.. అంతకంటే ముందే, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి బీజం పడింది.. శంకుస్థాపనలు చేశారు. శిలా ఫలకాలు పాతారు. వైఎస్సార్ హయాంలో కాలువలు తవ్వి, నిండా దోచేసుకున్నారన్న విమర్శలున్నాయి. వైఎస్సార్ మరణానంతరం పోలవరం ప్రాజెక్టుకి మరింతగా గ్రహణం పట్టేసింది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వచ్చింది. ఆ తర్వాతనే, పోలవరం ప్రాజెక్టు పనులు కాస్త వేగం పుంజుకున్నాయి. చంద్రబాబు హయాంలో స్పిల్ వే పనులు జోరందుకున్నమాట వాస్తవం. ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి చాన్నాళ్ళు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేశారు. లేదంటే, ఈపాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేదే. ఇక, 1600 కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్.. అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నిధులు కేంద్రం ఇవ్వాల్సి వుంది. ఆ నిధుల్ని త్వరగా రాబట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అధికారుల్ని ఆదేశించారు. ఇలా ఆదేశించే పరిస్థితి ఎందుకు వస్తోంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

పోలవరం.. జాతీయ ప్రాజెక్టు.. అవసరమైన మేర నిధులు కేటాయించాల్సిన కేంద్రం, అడుక్కుంటే తప్ప ఇవ్వని దుస్థితికి కారణమేంటి.? ఇంతకీ, అతి త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోవడం ఖాయమేనా.? ముంపు, పునరావాసం వ్యవహారాల మాటేమిటి.? ఇవన్నీ ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నలే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...