Switch to English

Pawan Kalyan: పవనన్నా… స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఓ మాటనరాదూ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

Pawan Kalyan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రివర్స్ గేరులో జగన్న స్టిక్కర్స్ అంటించుకొని 100 కిమీ వేగంతో వెనక్కు దూసుకుపోతోంది. కనుక ఏపీని కాపాడే నాధుడు ఎవరా? అని ప్రజలందరూ దిక్కులు చూస్తున్నారు. వైసీపీ, టిడిపి, బిజెపి నాయకులతో పోలిస్తే జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ మాటల్లో చాలా నిజాయితీ కనిపిస్తుంటుందని అందరికీ తెలుసు. కనుక ఆయన ఓ చిన్న ఆశాకిరణంగా కనిపిస్తున్నారు.

అయితే వేలకోట్లు పోగేసుకొని రాజకీయ చదరంగం ఆడుతున్న మన దేశముదురు రాజకీయ నాయకులతో ఆట ఆడాలంటే ఇంకా ఏదో చేయాలి. ఇంకా గట్టిగా నిలబడాలి. ఇంకా గట్టిగా ఢీకొనాలి. రాజకీయాలకు ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలి. వైసీపీ, టిడిపి, బిజెపి పార్టీలలోగా జనసేనలో కనీసం ఓ పాతికమంది నేతలను రాష్ట్ర ప్రజలందరూ గుర్తించేలా చేసుకోవాలి.

రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెపుతున్నమాటను పవన్‌ కళ్యాణ్‌ చేతలలో చూపించాలి. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి బ్రేకులు వేయించగలిగారు గానీ కొంతకాలమే ఆపగలిగారు. కేంద్రం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి పెట్టేస్తే, ఏపీలో బిఆర్ఎస్ ప్రవేశానికి ఇదో గొప్ప అవకాశంగా గుర్తించిన కేసీఆర్‌ చురుకుగా పావులు కదిపి, ప్లాంట్‌ని కాపాడేస్తానంటూ మంత్రుల చేత మాట్లాడించి, సింగరేణి అధికారులను వైజాగ్‌కి పరుగులు పెట్టించారు.

నిజానికి కేసీఆర్‌కు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని కాపాడాలనే ఆసక్తీ లేదు… సింగరేణికి అంత పెట్టుబడి పెట్టే కెపాసిటీ కూడా లేదు. అయినా దీనిని ఓ గొప్ప రాజకీయ అవకాశంగా మొట్టమొదట కేసీఆరే గుర్తించారు. అప్పుడు గానీ టిడిపి, వైసీపీలు నిద్ర మేల్కొలేదు. జనసేన నేతలు జరుగుతున్న ఈ రాజకీయ డ్రామాలని చూస్తున్నారే తప్ప చప్పుడు చేయడం లేదు!

అయితే పొద్దున ప్రయివేటీకరణ చేయడం లేదని చెప్పిన కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్ సింగ్‌ కులస్తే, సాయంత్రానికల్లా మాట మార్చేసి కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని నేనెలా ఆపగలను?అంటూ సన్నాయి నొక్కులు నొక్కి విమానం ఎక్కి వెళ్ళిపోయారు.

ఈలోగా ఏపీ, తెలంగాణ మంత్రులు దీనిపై ‘డెబిట్, క్రెడిట్’ లెక్కలు కట్టుకొని ఎవరి భుజాలు వారు చరుచుకొన్నారు. పరస్పర సహకార ధోరణిలో ఒకరినొకరు తిట్టుకొన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరూ సైలంట్ అయిపోయారు!

పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంత వేగంగా పావులు కదుపుతుంటే, ఏపీకి ముఖ్యమంత్రి కావాలనుకొంటున్న పవన్‌ కళ్యాణ్‌ మరెంత చురుకుగా ఉండాలి? కానీ ఏపీలో ఇంత భీకర యుద్దం జరుగుతున్నా పవనన్న ఒక్క ముక్క మాట్లాడలేదని, రెండు ట్వీట్స్ వేసి సరిపెట్టేశారని అభిమానులు అనుకోకుండా ఉంటారా?కనుక పవనన్నా… ఫ్యాన్స్ వెయింటింగ్ ఇక్కడ! బిజెపితో పొత్తుల గురించి ఆలోచించకుండా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ గురించి నిజాయితీగా ఓ ముక్క చెప్పరాదూ?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...