Switch to English

వైసీపీతో పొత్తుపై బీజేపీ వ్యూహాత్మక మౌనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటుందా.? ఎన్డీయే ప్రభుత్వంలో వైసీపీ అధికారికంగా చేరబోతోందా.? అన్న ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ని పెంచేస్తున్నాయి.

నేషనల్‌ మీడియా కథనాల్ని బట్టి ఎన్డీయేలో వైసీపీ చేరడం దాదాపు ఖాయమే. వైసీపీకి మొత్తంగా కేంద్రంలో మూడు కీలక పదవులు దక్కబోతున్నాయట.. అంటూ నేషనల్‌ మీడియా కోడై కూసేస్తోంది. తెలుగు మీడియాలోనూ కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తున్నాయి వైసీపీ – బీజేపీ స్నేహంపై. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్ళొచ్చాక ఈ తరహా కథనాలకు మరింత ఊపు వచ్చింది. వీటిల్లో చాలావరకు ‘పెయిడ్‌ ఆర్టికల్స్‌’ అన్న విమర్శలూ లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి.

అయితే, ఇంతవరకు బీజేపీ జాతీయ నాయకులెవరూ ఈ వ్యవహారంపై సానుకూలంగా స్పందించడంగానీ, ఖండించడంగానీ జరగలేదు. ఏపీ బీజేపీ నేతల్లో కొందరు మాత్రం, ‘ఆ వార్తల్లో నిజం లేదు’ అంటున్నారు. వైసీపీ మైండ్‌ గేమ్ ఆడుతోందన్నది బీజేపీ ఆరోపణ. వైసీపీ ఏ గేమ్ ఆడుతోందన్నది వేరే చర్చ. మిత్రపక్షం జనసేన పార్టీకి బీజేపీ ఈ విషయమై వివరణ ఇవ్వాలి కదా.?

రాష్ట్రంలో జనసేన – బీజేపీ మధ్య పొత్తు నడుస్తోంది. అయితే, గ్రామ స్థాయిలో జనసేన – బీజేపీ మధ్య ఇంకా ఆ గ్యాప్‌ అలాగే వుండిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ, వైసీపీతో కలిసి నడిచేందుకు మార్గం సుగమం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. అయితే, వైసీపీతో కలవడం ద్వారా బీజేపీకి వచ్చే లాభమేంటన్నదానిపై మాత్రం సందిగ్ధం అలాగే కొనసాగుతోంది.

‘మా నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ లేవు’ అని బీజేపీ అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో వైసీపీ అనుకూల మీడియాలో, బీజేపీ నుంచే వైసీపీని బతిమాలుకోవడం జరుగుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ‘వైసీపీ చేస్తోన్న ప్రచారం బీజేపీకి మరింత నష్టం చేస్తోంది..’ అంటూ బీజేపీ నేతలు కొందరు, అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారట.

ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. బీజేపీ వ్యూహాత్మక మౌనం మాత్రం అనేక సందేహాలకు తావిస్తోంది. జనసేన పార్టీ ఈ విషయంలో ఒకింత లీడ్‌ తీసుకుని, భారతీయ జనతా పార్టీ నుంచి వివరణ కోరితే మంచిదేమో.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...