సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో వున్న హ్యాష్ ట్యాగ్ ‘వేర్ ఈజ్ కేసీఆర్’ (కేసీఆర్ ఎక్కడ.?). కరోనా విషయంలో కేసీఆర్ మొదట్లో మాట్లాడిన మాటలు చాలా ‘భరోసా’ని ఇచ్చాయి తెలంగాణ ప్రజలకి. ‘ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన సరిగ్గా లేదు.. ముఖ్యమంత్రి సరిగ్గా వ్యవహరించడంలేదు.. కరోనా విషయంలో తడబడ్తున్నారు వైఎస్ జగన్.. అదే, తెలంగాణలో చూసుకుంటే పరిస్థితి అందుకు పూర్తి భిన్నం..’ అన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమయ్యాయి.
అందులో కొంత నిజం లేకపోలేదు కూడా. కానీ, క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. మొదట్లో కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన మాట వాస్తవం. కానీ, ఇప్పుడు పరిస్థితి అత్యంత అధ్వానం. కరోనా వైరస్‌కి హద్దూ అదుపూ లేకుండా పోయింది తెలంగాణలో. చేస్తున్న అరకొర టెస్టులకే కుప్పలు తెప్పలుగా కేసులు నమోదవుతున్నాయి. అదే రోజువారీ కరోనా పరీక్షలు 25 వేలు జరిగితే.. కరోనా సునామీని తెలంగాణ ప్రజలు మానసికంగా తట్టుకునే పరిస్థితి వుండదేమో.
మొత్తమ్మీద, కేసీఆర్ మీద కరోనా విషయంలో తెలంగాణ ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోంది. అదే సమయంలో, కేసీఆర్ కూడా.. కరోనా విషయమై ప్రజలకు భరోసా ఇచ్చేందుకూ సుముఖత వ్యక్తం చేయడంలేదు. మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నా.. ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి. దేశం మొత్తమ్మీద చాలా రాష్ట్రాలు కరోనా టెస్టుల విషయంలో దూసుకుపోతున్నాయి. కానీ, తెలంగాణలో ఆ స్థాయిలో టెస్టులు జరగడంలేదు.
మరోపక్క పాజిటివిటీ రేటు అనూహ్యంగా పెరిగిపోయింది. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కి కూడా దెబ్బ తగులులోతంది. అయినా, కేసీఆర్ పెదవి విప్పకపోవడం గమనార్హం. మరోపక్క, ‘కేసీఆర్‌కి కరోనా సోకింది.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో వున్నారు..’ అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టింగ్స్ పడుతున్నాయి. కానీ, కేసీఆర్ క్షేమంగానే వున్నారని అధికార పార్టీ చెబుతోంది.
ఏదిఏమైనా, కేసీఆర్ మౌనం వీడాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవ పరిస్థితి చెప్పాలి. అదే సమయంలో ప్రజలకు భరోసా ఇచ్చేలా మాట్లాడాలి.. మాటలే కాదు, చేతల్లో కూడా ఇంకాస్త సమర్థవంతమైన పరిపాలన చూపించాల్సి వుంటుంది. ‘ముఖ్యమంత్రి ఎక్కడ.?’ అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యిందంటే.. ఇది అధికార పార్టీకి రాజకీయంగా అస్సలేమాత్రం మంచిది కాదు.!
453321 391458Hello. Fantastic job. I did not expect this. This is a outstanding articles. Thanks! 502145
210969 891216Every email you send ought to have your signature with the link to your internet web site or weblog. That generally brings in some visitors. 128112
685725 117333I believe this internet site has some actually great data for every person : D. 9729
992578 196113Hi there, just became aware of your weblog through Google, and identified that its really informative. Im gonna watch out for brussels. I will appreciate should you continue this in future. Lots of men and women will likely be benefited from your writing. Cheers! 230049