మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవికి యూత్ క్రేజ్ తీసుకొచ్చిన మంత్రిగారి వియ్యంకుడు

ట్రైన్ ఫైట్, డిస్కో డ్యాన్సులతో కిక్కెక్కించిన చిరంజీవి ‘గూండా’

చిరంజీవి సినిమా కంటే.. ‘చిరంజీవి’ అనే పేరే సినీ అభిమానులకు కిక్కెక్కిస్తున్న రోజులవి. అప్పటికే అయిదేళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న చిరంజీవి ప్రేక్షకుల గుండెల్లో స్థానం.. అభిమానులకు ఆరాధ్య దైవం.. సినీ పరిశ్రమకు వరంలా.. దర్శక, నిర్మాతలకు లక్కీ డీప్ అయిపోయారు. ‘ఖైదీ’కి ముందు చిరంజీవి సంచలనం అయితే.. ‘ఖైదీ’ తర్వాత ప్రకంపనలే సృష్టించారు. చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు..

యువతకు స్ఫూర్తి నింపిన చిరంజీవి ‘ఛాలెంజ్’

చిరంజీవి.. ఈ పేరును తెలుగు చిత్ర పరిశ్రమ ఓన్ చేసుకున్న రోజులవి. 1980 దశకంలో చిరంజీవి నామస్మరణే జరిగిందంటే అతిశయోక్తి లేదు. చిన్న చిన్న పాత్రలు, అతిధి పాత్రలు, విలన్ పాత్రల నుంచి హీరో పాత్రల వరకూ చిరంజీవి చేయనిది లేదు. ఈక్రమంలో యాక్షన్, ఫ్యామిలీ, సెంటిమెంట్ పాత్రలు సైతం చేశారు. ఈ ఒరవడిలో ఖైదీ తర్వాత చిరంజీవి తన ప్రతి సినిమాలో ఏ ప్రత్యేకత చూపిస్తారనే ఆసక్తితోనే చూశారు ప్రేక్షకులు. ఈక్రమంలో ఆయన ఓ నవలను సినిమాగా చేశారు

రిస్కీ ఫైట్స్, స్టైలిష్ డ్యాన్సులతో చిరంజీవి ‘దొంగ’

తెలుగు సినిమాల్లో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగేందుకు ఆయన పడిన కష్టం, కృషి, పట్టుదల గురించి ఎంత చెప్పినా.. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అందుకే.. ఈ జనరేషన్ లో ఎందరో ‘మాకు చిరంజీవి గారే ఇన్ స్పిరేషన్’ అంటూంటారు. అంతలా ఆయన ఆదరణ పొందడానికి ఆయన చేసిన డ్యాన్సులు, డూప్ లేని ఫైట్లు, కామెడీ ముఖ్య కారణం. డైనమిక్ హీరోగా చిరంజీవి చేసే ఫైట్లకు ఉన్న ఆదరణ సామాన్యమైనది కాదు. తెలుగు సినిమాల్లో ఒరిజినల్ స్టంట్స్ చేయడంలో దిట్ట

బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన చిరంజీవి ‘అడవి దొంగ’

తెలుగు సినిమాని తన ఫైట్లు, డ్యాన్సులతో పరుగులు పెట్టించారు చిరంజీవి. దీంతోపాటే కమర్షియల్ లెక్కలనూ మార్చేశారు. తన సినిమా కలెక్షన్లతో బాక్సాఫీస్ లెక్కల్ని కొత్తగా రుచి చూపించారు. ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నిరంజన్ రెడ్డి.. ‘కోటి, రెండు, మూడు, నాలుగు, ఐదు కోట్ల కలెక్షన్లను మొదట పరిచయం చేసింది.. ధియేటర్లు పెరగడానికి.. ఎందరో సినిమా వ్యాపారం చేయడానికి చిరంజీవి సినిమాలు.. వాటి కలెక్షన్లే కారణం’ అని గుర్తు చేశారు. 80వ దశకంలో చిరంజీవి సినిమాల వసూళ్లు ఇలానే ఉండేవి.....

ఫ్యామిలీ డ్రామాతో ‘విజేత’గా నిలిచిన చిరంజీవి

కుటుంబ కథా చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది. ఈతరహా సినిమాలకు మాస్ టచ్ ఇస్తే ఆ లెవల్ వేరుగా ఉంటుంది. కథకు మహిళా ప్రేక్షకులు.. హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అవుతారు. దీంతో సినిమా సక్సెస్ కావడమే కాకుండా కుటుంబ ప్రేక్షకులు ఆ హీరోను ఓన్ చేసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి ఇందుకు ఉదాహరణ. 80వ దశకంలో రచయితలు, దర్శకులు ఇలా చేసిన పలు సినిమాలు హిట్టయ్యాయి....

గ్రామీణ నేపథ్యంలో చిరంజీవి మాసివ్ హిట్ ‘కొండవీటి రాజా’

సినిమాల్లో గ్రామీణ నేపథ్యం ఉన్న కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అటువంటి కథలు పాత తరంతోపాటు 80వ దశకంలో కూడా వచ్చాయి. వీటికి స్టార్ ఇమేజ్ తోడైతే సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ తరహాలో సూపర్ హిట్ అయిన చిరంజీవి సినిమా ‘కొండవీటి రాజా’. సహజంగానే గ్రామీణ నేపథ్యం, పంట పొలాలు, పాడి, గ్రామాల్లో చిత్రీకరణ, కుటుంబ కథలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. దీనికి ఆకట్టుకునే కథ కీలకం. ఇవన్నీ కొండవీటి రాజాలో ఉన్నాయి. చిరంజీవికి స్టార్ ఇమేజ్ వచ్చాక మాస్, యాక్షన్ సినిమాలే చేసారు.

చిరంజీవిలోని కామెడీ టైమింగ్ కు కేరాఫ్ అడ్రెస్ ‘చంటబ్బాయి’

సినిమాలో హీరో ఫైట్లు, డ్యాన్సులు, నటన.. నేర్చుకుని చేయొచ్చేమో కానీ.. కామెడీ చేయడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. స్టార్ హీరో మాస్, క్లాస్ ఆడియన్స్ ను కామెడీతో మెప్పించాలంటే టైమింగ్ తెలియాలి.. తనలో హాస్యం, చతురత ఉండాలి. ఇవి పుష్కలంగా ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయనకు ఫైట్లు, డ్యాన్సుల్లో ఎంత పేరుందో కామెడీ చేయడంలో అంత పేరుంది. తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పువ్వులు పూయించిన సినిమాలు ఉన్నాయి....

చిరంజీవికి మదర్ సెంటిమెంట్ తో బ్లాక్ బస్టర్.. ‘రాక్షసుడు’

సినిమాలు తీసేందుకు కొన్ని ఫార్ములాలు ఉంటాయి. యాక్షన్, థ్రిల్లర్, ప్రేమ, ఫ్యామిలీ డ్రామా.. ఇలా కొన్ని ఫార్ములాలతోనే ఏ కథైనా సినిమాగా తెరకెక్కుతుంది. ఇందులో తల్లి సెంటిమెంట్ ఒకటి. హీరో-తల్లి సెంటిమెంట్ తో ఎన్నో హిట్స్ ఉన్నాయి. చిరంజీవి హీరోగా వచ్చిన సినిమాల్లో కూడా తల్లి సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్లు అయిన సినిమాలు ఉన్నాయి. వీటిలో ప్రముఖమైంది ‘రాక్షసుడు’.

ఊరమాస్ పాత్రలో చిరంజీవికి సూపర్ హిట్ ‘దొంగ మొగుడు’

హీరోలకు మాస్ ఇమేజ్ రావడం ఓ వరం. ఇందుకు తగ్గ కథలని ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తారు. మాస్ ఇమేజ్ ఇచ్చే కిక్కు అది. క్లాస్ పాత్రలకు కొన్ని కొలమానాలు ఉంటాయి. మాస్ పాత్రల్లో ఎంత చేస్తే అంత. ఫ్యాన్స్ పెరుగుతారు.. ప్రేక్షకాభిమానం పెరుగుతుంది. నటుడిగా స్థిరపడటం వేరు.. మాస్ హీరోగా నిలదొక్కుకోవడం వేరు. దీనిని బాగా ఒడిసి పట్టిన హీరో చిరంజీవి.