Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఊరమాస్ పాత్రలో చిరంజీవికి సూపర్ హిట్ ‘దొంగ మొగుడు’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

హీరోలకు మాస్ ఇమేజ్ రావడం ఓ వరం. ఇందుకు తగ్గ కథలని ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తారు. మాస్ ఇమేజ్ ఇచ్చే కిక్కు అది. క్లాస్ పాత్రలకు కొన్ని కొలమానాలు ఉంటాయి. మాస్ పాత్రల్లో ఎంత చేస్తే అంత. ఫ్యాన్స్ పెరుగుతారు.. ప్రేక్షకాభిమానం పెరుగుతుంది. నటుడిగా స్థిరపడటం వేరు.. మాస్ హీరోగా నిలదొక్కుకోవడం వేరు. దీనిని బాగా ఒడిసి పట్టిన హీరో చిరంజీవి. సహజ నటన, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, హావభావాలతో 80వ దశకంలో మాస్ ప్రేక్షకుల్ని పూర్తిగా తనవైపుకు తిప్పుకున్నారు. తనకు పెరిగిన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్ కోసమే ఆ జోనర్లో సినిమాలు చేశానని ఇటివల చిరంజీవే స్వయంగా చెప్పారు. అలా ఆయనలోని మాస్ యాంగిల్ ను తొలిసారి వెలికితీసిన సినిమా ‘దొంగమొగుడు’.

ఊరమాస్ పాత్రలో..

ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. సహజంగా క్లాస్ రోల్ లో ఓ పద్ధతిగా నటిస్తే.. మాస్ పాత్రలో చెలరేగిపోతారు. దొంగమొగుడులో చిరంజీవి చేసిన పని అదే. టెక్స్ టైల్ ఫ్యాక్టరీ యజమాని రవితేజ పాత్రలో అమాయకంగా, హుందాగా నటిస్తే.. స్టంట్ మాస్టర్ నాగరాజుగా ఊరమాస్ పాత్ర చేశారు. ధియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్మకం, రౌడీలతో ఫైట్లు, మాస్ పాత్రే చేసిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన రాధికతో కామెడీ సన్నివేశాల్లో చిరంజీవి మాస్ నటనా విశ్వరూపాన్నే చూపిస్తారు. రవితేజలా ఆయన ఇంట్లో ఆఫీసులో చిరంజీవి చేసిన ఊరమాస్ నటన ప్రేక్షకుల్ని చక్కిలిగింతలు పెట్టింది. ప్రతి సీనులో ఆయన డైలాగ్ డెలివరీ, నటన, హావభావాలు దొంగమొగుడు సినిమాను ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంచాయంటే అతిశయోక్తి కాదు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఊరమాస్ పాత్రలో చిరంజీవికి సూపర్ హిట్ ‘దొంగ మొగుడు’

పాటలన్నీ చార్ట్ బస్టర్లే..

సినిమాలో చిరంజీవికి ముగ్గురు హీరోయిన్లుగా మాధవి, రాధిక, భానుప్రియ నటించారు. ఎవరి పాత్ర ప్రాధాన్యం వారిదే. రాధికలోని మాస్ యాక్టింగ్ స్కిల్స్ ను సినిమాలో చూడొచ్చు. చిరంజీవి-రాధిక మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. రవితేజ ఇంట్లోని వారికి బుద్ధి వచ్చేలా చేసే సమయంలో చిరంజీవి నటన అద్భుతమనే చెప్పాలి. చక్రవర్తి మరోసారి సినిమాకు తన సంగీతంలో మాయాజాలమే చేశారు. ప్రతి పాటా హిట్టే. ‘నల్లంచు తెల్ల చీర..’ పాటలో చిరంజీవి సిగరెట్ వెలిగించి చేసే డ్యాన్స్ స్టయిల్ ఆయనకు ఆయనే సాటి అనేలా ఉంటుంది. తన మార్క్ గ్రేస్ స్టెప్స్, హావభావాలతో పాటలన్నింటినీ ధియేటర్లో విజిల్స్ పడేలా చేశారు. పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ గా పక్కా కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కించారు.

ఈ సినిమానే మూలం..

మహేశ్వరి మూవీస్ బ్యానర్ పై ఎస్పీ వెంకన్నబాబు సినిమా నిర్మించారు. ఎ.కోదండరామిరెడ్డి మరోసారి చిరంజీవితో ష్యూర్ షాట్ హిట్ కొట్టారు. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ రచన ‘నల్లంచు తెల్లచీర’ నవల ఆధారంగా సినిమా తీశారు. అప్పటికే యండమూరి నవలలు సినిమాలుగా చేస్తున్నారు చిరంజీవి. 1987 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదలైన దొంగమొగుడు సూపర్ హిట్ అయి కలెక్షన్ల కనకవర్షంతో శతదినోత్సవ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి అనేక మాస్ పాత్రలు చేశారు. వీటికి దొంగమొగుడు సినిమాలో స్టంట్ మాస్టర్ నాగరాజు పాత్ర ఒక మలుపుగా చెప్పాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....