Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవికి యూత్ క్రేజ్ తీసుకొచ్చిన మంత్రిగారి వియ్యంకుడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

చిరంజీవితో సినిమా అంటే దర్శక, నిర్మాతలకు ఆశ, ప్రేక్షకులకు ఉత్తేజం వస్తున్న రోజులవి. ఆయన కాల్షీట్ల కోసం క్యూలు కడుతున్నారు. కొత్త సినిమా చిరంజీవి నుంచి వస్తుందంటే చూడాలన్న కోరిక ప్రేక్షకులకు కలుగుతోంది. జోనర్ ఏదైనా.. చిరంజీవి తన నటన, డ్యాన్స్, ఫైట్లతో మెప్పించేస్తాడు.. అనే నమ్మకం యావత్ తెలుగు సినిమా పరిశ్రమ, ప్రేక్షకుల్లో పూర్తిగా ఉన్న రోజులు. దిగ్గజ దర్శకులు ఆయనతో సినిమాలు చేస్తున్నారు. అలా చిరంజీవి మేనియా మోగిపోతున్న రోజుల్లో ఆయనకు దక్కిన మరో సూపర్ హిట్ ‘మంత్రిగారి వియ్యంకుడు’. అప్పటికి కొద్ది రోజుల ముందే టాలీవుడ్ గేమ్ చేంజర్.. చిరంజీవిని స్టార్ ను చేసిన ‘ఖైదీ’ విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్:  చిరంజీవికి యూత్ క్రేజ్ తీసుకొచ్చిన మంత్రిగారి వియ్యంకుడు

 

కాలేజీ, స్నేహం నేపథ్యంలో..

ప్రముఖ సినీ దిగ్గజాలు బాపు, రమణ దర్శకత్వం, రచనతో తెరకెక్కిందీ సినిమా. కాలేజీలో చదివే యువకుడిగా, తల్లిదండ్రులను అవమానించిన వారి స్నేహితుడికి బుద్ది చెప్పి వారి గౌరవం నిలిపే కొడుకుగా చిరంజీవి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పటికి ఎన్నో యాక్షన్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు చేసిన చిరంజీవిని మళ్లీ ఈ సినిమాలో పూర్తి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా చూపించారు బాపు, రమణ. కాలేజీ నేపథ్యం, స్నేహం, ఆటపాటలు, సరదా ర్యాగింగ్.. ఇవన్నీ అప్పటి యువతకు ఈ సినిమా విపరీతంగా నచ్చేలా చేశాయి. చిరంజీవి మేకోవర్, ఫెర్మార్మెన్స్, చలాకీతనం, పాటలు, ఫైట్స్ లో చూపిన వైవిధ్యం వారికి చిరంజీవిని ఆరాధ్య హీరోను చేశాయి. ఇళయరాజా సంగీతంలోని వీనులవిందైన పాటలకు చిరంజీవి స్టెప్పులతో హోరెత్తించేశారు.

 

బాపు-రమణ విజయసూత్రం..

ఈ సినిమా మళయాళ సినిమాకు రీమేక్. ముద్దు ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మాత జయకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. ముళ్లపూడి వెంకట రమణ స్క్రీన్ ప్లే, మాటలు రాయగా.. బాపు దర్శకత్వం వహించారు. మనవూరి పాండవులు తర్వాత చిరంజీవి-బాపు కలయికలో వచ్చిన సినిమా ఇది. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, సైటైర్స్, యూత్, కాలేజీ సరదాలు, స్టూడెంట్ యూనియన్స్, రాజకీయాలు, ఎన్నికలు, పాటలు, ఫైట్లు.. అన్నింటినీ సమపాళ్లలో ఇమడ్చారు బాపు-రమణ. అప్పటికే తెలుగు సినిమాపై వెలిగిపోతున్న చిరంజీవి ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యారు. పాటలు, డ్యాన్స్, ఫైట్స్.. ప్రేక్షకులకు ధియేటర్లో ఉల్లాసాన్ని ఇచ్చింది. సినిమాలో చిరంజీవి ఎంట్రన్సే అప్పటి ఆయన రేంజ్ కు నిదర్శనంగా ఉంటుంది.

చిరంజీవికి యూత్ క్రేజ్ తీసుకొచ్చిన మంత్రిగారి వియ్యంకుడు

అమాంతం పెరిగిన చిరంజీవి క్రేజ్..

అప్పటికే ‘ఖైదీ’ మేనియాతో ఊగిపోతోంది ఆంధ్రప్రదేశ్. ఖైదీ అక్టోబర్ 28న విడుదలైతే.. మంత్రిగారి వియ్యంకుడు నవంబర్ 4న విడుదలైంది. అయినా.. ప్రేక్షకులు ఈ సినిమాకూ అద్భుత విజయం కట్టబెట్టారు. ఓపక్క యాక్షన్ మూవీ, మరోపక్క యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. వరుస హిట్లు, క్రేజ్, అమాంతం పెరిగిన ఇమేజ్, ఫ్యాన్స్ అసోసియేషన్లు చిరంజీవిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. విద్యార్ధి నాయకుడు బాబ్జీగా చిరంజీవి యువతను తన వైపుకు తిప్పుకున్నారు. నిజంగా చిరంజీవి కాలేజీ స్టూడెంటే అనేంతగా సినిమాలో ఆయన పాత్ర ఉంటుంది. దీంతో ఈ సినిమా చిరంజీవికి మరో శతదినోత్సవ సినిమా అయింది. సినిమాలో చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు అతిధి పాత్ర చేయడం విశేషం.

21 COMMENTS

  1. Hi there! I realize this is somewhat off-topic however I
    needed to ask. Does operating a well-established website like yours require
    a massive amount work? I am brand new to blogging however I do write
    in my diary everyday. I’d like to start a blog so I can easily share my own experience and feelings online.
    Please let me know if you have any kind of ideas or tips for brand new
    aspiring bloggers. Thankyou!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

రాజకీయం

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

ఎక్కువ చదివినవి

పో..తిన మహేష్.! పవన్ కళ్యాణ్ చేసిందే కరెక్ట్.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విజయవాడ వెస్ట్ అనేది జనసేన పార్టీకి అత్యంత కీలకం.. అని నిన్న మొన్నటిదాకా జనసైనికులు భావించారు. అది నిజం కూడా.! విజయవాడ వెస్ట్‌లో జనసేన పార్టీ...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ కు ఫ్యామిలీ ఆడియన్స్.. కలిసొచ్చిన సెలవులు

Family Star: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా సక్సెస్ ఫుల్ గా ధియేటర్లలో రన్ అవుతోంది. సినిమాకు ఏపీ,...

వాలంటీర్లకు పది వేలు.! ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు.?

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా, వాలంటీర్లకు నెలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. అంతకు ముందు సామాజిక పెన్షన్లను...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...