Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: గ్రామీణ నేపథ్యంలో చిరంజీవి మాసివ్ హిట్ ‘కొండవీటి రాజా’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

సినిమాల్లో గ్రామీణ నేపథ్యం ఉన్న కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అటువంటి కథలు పాత తరంతోపాటు 80వ దశకంలో కూడా వచ్చాయి. వీటికి స్టార్ ఇమేజ్ తోడైతే సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ తరహాలో సూపర్ హిట్ అయిన చిరంజీవి సినిమా ‘కొండవీటి రాజా’. సహజంగానే గ్రామీణ నేపథ్యం, పంట పొలాలు, పాడి, గ్రామాల్లో చిత్రీకరణ, కుటుంబ కథలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. దీనికి ఆకట్టుకునే కథ కీలకం. ఇవన్నీ కొండవీటి రాజాలో ఉన్నాయి. చిరంజీవికి స్టార్ ఇమేజ్ వచ్చాక మాస్, యాక్షన్ సినిమాలే చేసారు. వీటికి భిన్నంగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా చేశారు. అచ్చ తెలుగు సంప్రదాయ పంచెకట్టులో చిరంజీవి కనిపిస్తారు. ఎడ్ల పందాలు, కర్రసాము వంటి గ్రామీణ క్రీడలు ప్రేక్షకులను అలరించాయి.

చిరంజీవి మేనరిజమ్..

చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు సినిమాలో కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో.. ‘మొదట హీరో దొంగగా వచ్చి క్లైమాక్స్ లో నేనే అసలైన పోలిస్ అంటాడు’ అని సందర్భానుసారం ఓ డైలాగ్ అంటారు. అచ్చం అలాంటి కథే కొండవీటి రాజా. రివెంజ్ డ్రామానే అయినా మొదట పల్లెటూరి యువకుడిగా నటించిన చిరంజీవి సెకండాఫ్ లో పురావస్తు శాఖ అధికారిగా కనిపిస్తారు. గ్రామంలోని ఓ కోటలోని నిధిని విలన్ల దక్కకుండా చేసే అధికారిగా నటిస్తారు. ఈ తరహా కథ, కథనం ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమాలో చిరంజీవి మేనరిజమ్ ‘దెబ్బక్కాయ్.. ట్టో’ ఫేమస్ అయింది. కొబ్బరికాయను మోచేత్తో కొట్టడం, కాలు కింద పెట్టకుండా ఫైట్ చేయడం ప్యాన్స్ తో ఈలలు వేయించాయి.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: గ్రామీణ నేపథ్యంలో చిరంజీవి మాసివ్ హిట్ ‘కొండవీటి రాజా’

పాటలు హైలైట్

విలన్లతో చిరంజీవి చేసే కామెడీ, ఆటపట్టించడం, చిరంజీవి హీరోయిజం, మాస్ పాత్ర ఫ్యాన్స్ ను అలరించాయి. సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా అప్పటికే చిరంజీవికి సరిజోడుగా పేరు తెచ్చుకున్న విజయశాంతి, రాధ నటించారు. వీరితో చిరంజీవి అల్లరి ఆకట్టుకుంటుంది. వీరిమధ్య ప్రేమ, సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. పాటల్లో వీరి జోడి, డ్యాన్స్ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో దర్శకేంద్రుడి స్టైల్ కనిపిస్తుంది. చక్రవర్తి మరోసారి తన బాణీల పవర్ చూపించి వీనులవిందైన పాటలు అందించారు. వీటిలో ‘మంచమేసి.. దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా..’ అనే పాట మాస్ బీట్ తో ధియేటర్లను హోరెత్తించింది.

నిర్మాత సంచలన ప్రకటన..

దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరంజీవికి లక్కీ ప్రొడ్యూసర్ గా పేరున్న కె.దేవీవరప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. అడవిదొంగతో బాక్సాఫీసు లెక్కల్ని షేక్ చేసిన కె.రాఘవేంద్రరావు మరోసారి చిరంజీవితో తన మ్యాజిక్ చేసి చూపించారు. 1986 జనవరి 31న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్టయింది. సుప్రీంహీరోగా వెలిగిపోతున్న చిరంజీవి ఇమేజ్ పెంచింది. 25 కేంద్రాల్లో 100 రోజలు పూర్తి చేసుకుని శతదినోత్సవ సినిమాగా నిలిచింది. ఎన్టీఆర్, చిరంజీవితో కలిపి తిరుగులేని మనిషి తీసిన దేవీవరప్రసాద్ ఓ సందర్భంలో.. ‘ఎన్టీఆర్, చిరంజీవిలతో తప్ప మరెవరితోనూ సినిమా తీయను’ అనే స్టేట్మెంట్ ఇచ్చి సంచలనం రేపారు. నిజంగానే ఎన్టీఆర్ తర్వాత ఆయన చిరంజీవితోనే సినిమాలు చేసారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: గ్రామీణ నేపథ్యంలో చిరంజీవి మాసివ్ హిట్ ‘కొండవీటి రాజా’

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....