Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవిలోని కామెడీ టైమింగ్ కు కేరాఫ్ అడ్రెస్ ‘చంటబ్బాయి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

సినిమాలో హీరో ఫైట్లు, డ్యాన్సులు, నటన.. నేర్చుకుని చేయొచ్చేమో కానీ.. కామెడీ చేయడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. స్టార్ హీరో మాస్, క్లాస్ ఆడియన్స్ ను కామెడీతో మెప్పించాలంటే టైమింగ్ తెలియాలి.. తనలో హాస్యం, చతురత ఉండాలి. ఇవి పుష్కలంగా ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయనకు ఫైట్లు, డ్యాన్సుల్లో ఎంత పేరుందో కామెడీ చేయడంలో అంత పేరుంది. తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పువ్వులు పూయించిన సినిమాలు ఉన్నాయి. చిరంజీవిలోని మాస్ కామెడీ, ఎక్స్ ప్రెషన్స్, టైమింగ్ ను ఆవిష్కృతం చేసిన సినిమా ‘చంటబ్బాయి’. కామెడీ జోనర్ సినిమాలో హీరోనే కామెడీ చేసి నవ్వు తెప్పిస్తే, ప్రేక్షకులను మెప్పిస్తే ఆ కిక్కే వేరు. ప్రేక్షకులకు ఆ కిక్కు ‘చంటబ్బాయి’తో ఇచ్చారు చిరంజీవి.

తొలిసారి చిరంజీవి కామెడీ..

అప్పటివరకూ చిరంజీవి మాస్ యాంగిల్, స్పీడ్ ఫైట్లు, మెరుపు డ్యాన్సులే చూసిన ప్రేక్షకులకు తొలిసారి చిరంజీవిలోని కామెడీ యాంగిల్ తెలిసింది. ప్రైవేట్ డిటెక్టివ్ పాండురంగా రావు (పాండ్)గా ఆయన చేసిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘కాల్ మీ పాండ్.. జేమ్స్ పాండ్’ అనే డైలాగ్ తో తన పాత్ర స్వభావాన్ని, కామెడీని చూపిస్తారు. హీరోయిన్ సుహాసిని, ఇన్ స్పెక్టర్ సౌమిత్రి, అసిస్టెంట్ సుత్తివేలు కాంబినేషన్లో ఆయన సన్నివేశాలు అద్భుతం. సుహాసిని వచ్చే ముందు కోటు వేసుకుని రిహార్సల్ చేసే సీన్ లో ఆయన హావభావాలు ఎవర్ గ్రీన్. కుర్చీలో నుంచి కింద పడ్డా దానిని కప్పిపుచ్చుకునేందుకు ఆయన పడే పాట్లు ఇవన్నీ కడుపుబ్బా నవ్విస్తాయి.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవిలోని కామెడీ టైమింగ్ కు కేరాఫ్ అడ్రెస్ ‘చంటబ్బాయి’

చార్లీచాప్లీన్ లా..

చిరంజీవి తనముందు చేస్తున్న కామెడీకి అమాయకురాలిగా ఉంటూ.. నవ్వు ఆపుకోకుండా హీరోయిన్ సుహాసిని ఎలా ఉన్నారా అనిపిస్తుంది. జేమ్స్ బాండ్ తరహాపాత్ర కావడంతో చిరంజీవి మేకోవర్ కూడా ప్రత్యేకంగా ఉండేలా డిజైన్ చేశారు. ఓ పాటలో ప్రముఖ హాస్యనటుడు చార్లీ చాప్లీన్ గెటప్ లో మెప్పించారు. తొలిసారి అమ్మాయి వేషధారణలో కూడా కనిపిస్తారు. అల్లు అరవింద్ సినిమాలో ఓ పాత్రలో నటించారు. చిరంజీవి ఇంత కామెడీ చేసిన ఇదే సినిమాలో సెంటిమెంట్ కూడా పండించారు. తప్పిపోయిన చంటబ్బాయిని వెదికే క్రమంలో తానే చంటబ్బాయి అని తెలిసినప్పుడు భావోద్వేగాలు చూపిస్తారు. చక్రవర్తి తన సంగీతంతో మరోసారి మ్యాజిక్కే చేశారు. పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి.

ఎన్నో మ్యాజిక్కులు..

జ్యోతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత భీమవరపు బుచ్చిరెడ్డి ఈ సినిమా నిర్మించారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు జంధ్యాల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవిలోని పూర్తిస్థాయి కామెడీని వెలికితీసిన ఘనత ఆయనకే దక్కుతుంది. సినిమా టైటిల్స్ వేయడంలోనే తన మార్కు చూపిస్తారు. సినిమాకు అసోసియేట్ డైరక్టర్ గా పని చేసిన ఈవీవీ సత్యనారాయణ ఆయన దర్శకుడయ్యాక ఎన్నో సినిమాల్లో ఇదే వెరైటీ చూపారు. 1986 ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమా విడుదలైంది. సినిమా యావరేజ్ అయినా.. చిరంజీవి కెరీర్లో ‘చంటబ్బాయి’ ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇప్పటికీ చిరంజీవి అభిమానులకు, ప్రేక్షకులకు ఈ సినిమా ఓ వినోదాల విందు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...