Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: రిస్కీ ఫైట్స్, స్టైలిష్ డ్యాన్సులతో చిరంజీవి ‘దొంగ’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమాల్లో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగేందుకు ఆయన పడిన కష్టం, కృషి, పట్టుదల గురించి ఎంత చెప్పినా.. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అందుకే.. ఈ జనరేషన్ లో ఎందరో ‘మాకు చిరంజీవి గారే ఇన్ స్పిరేషన్’ అంటూంటారు. అంతలా ఆయన ఆదరణ పొందడానికి ఆయన చేసిన డ్యాన్సులు, డూప్ లేని ఫైట్లు, కామెడీ ముఖ్య కారణం. డైనమిక్ హీరోగా చిరంజీవి చేసే ఫైట్లకు ఉన్న ఆదరణ సామాన్యమైనది కాదు. తెలుగు సినిమాల్లో ఒరిజినల్ స్టంట్స్ చేయడంలో దిట్ట. మెలికలు తిరిగిపోతూ లయబద్దంగా డ్యాన్సు చేయడంలో నేర్పరి. ఈ రెండింటి కలయికతో చిరంజీవి సూపర్ హిట్ కొట్టిన సినిమాల్లో ఒకటి ‘దొంగ’. భారీ అంచనాలతో విడుదలై సంచలన విజయం సాధించిందీ సినిమా.

రిస్కీ ఫైట్స్..

డ్యాన్స్, ఫైట్లలో చిరంజీవి వేసిన దారిలో తెలుగు సినిమా నడుస్తున్న దశ. చిరంజీవి నుంచి కూడా ప్రేక్షకులు ఆశిస్తున్న కొత్తదనాన్ని దొంగ సినిమాలో మరోసారి చూపి.. ప్రేక్షకులతో చప్పట్టు కొట్టించారు. క్లైమాక్స్ ఫైట్ లో ఎత్తైన భవనం గోడ మీద ఎటువంటి సపోర్ట్ లేకుండా పిల్లిమొగ్గ వేసే షాట్ ఊపిరి బిగపట్టేలా చేస్తుంది. నటుడు రాజీవ్ కనకాల కూడా తాను చిన్నతనంలో చిరంజీవి చేసిన ఈ రిస్క్ షాట్ ను దగ్గర నుంచి చూశానని ఓ సందర్భంలో చెప్పారు. సినిమా కథగా రివెంజ్ డ్రామానే అయినా.. చిరంజీవి పాత్ర దొంగగా.. తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకునే పాత్ర. దీంతో సినిమాలో యాక్షన్ పార్టు ఎక్కువ. ఫైట్ మాస్టర్ రాజు ఆధ్వర్యంలో రిస్కీ ఫైట్లను కూడా ఇష్టంగా చేసి మెప్పించారు చిరంజీవి.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: రిస్కీ ఫైట్స్, స్టైలిష్ డ్యాన్సులతో చిరంజీవి ‘దొంగ’*

జాంబీ డ్యాన్సులు..

‘దొంగ’ మూవీ మ్యూజికల్ హిట్ కూడా. చక్రవర్తి సంగీతంలోని అన్ని పాటలు సూపర్ హిట్టే. పాటల్లో చిరంజీవి కొత్త ప్రయోగం చేసారని చెప్పాలి. మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ ఆల్బమ్ లా ‘గోలీమార్’ అనే పాట చేశారు. ఇందులో చిరంజీవి చేసిన డ్యాన్సులకు ధియేటర్లు మోగిపోయాయి. దొంగ దొంగ, సరి సరి.. వంటి పాటలు హుషారెత్తించాయి. ముఖ్యంగా రెడ్ లెదర్ జాకెట్ తో జాంబీ స్టైల్ మేకప్ వేసుకుని జాంబీ డ్యాన్సర్లతో చేసిన గోలీమార్ పాట ధియేటర్లను ఊపేసింది. దాదాపు 30ఏళ్ల తర్వాత 2014లో.. చైనాలో ఓ డ్యాన్స్ షోలో ఇదే ‘గోలీమార్’ పాటను చైనీయులు చేయడం విశేషం. ఇంటర్నెట్ లో ఈ పాట హోరెత్తింది.

లక్కీ బ్యానర్..

హీరోయిన్ రాధతో చిరంజీవి కెమిస్ట్రీకి ఎంతో పేరు. వీరిద్దరి జంట సినిమాలో చూడముచ్చటా ఉండటమే కాకుండా పాటల్లో వీరి కాంబో ప్రేక్షకులకు కనులవిందే అయింది. చిరంజీవికి కలిసొచ్చిన ఎ.కోదండరామిరెడ్డి ఈ సినిమాకూ దర్శకుడు. వారిద్దరి కాంబినేషన్లో దొంగ మరో సూపర్ హిట్టుగా నిలిచింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన టి.త్రివిక్రమరావు తమ విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించారు. 1985 మార్చి 14న విడుదలైన ఈ సినిమా శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. చిరంజీవితో గూఢచారి నెం.1 సినిమా తీసి హిట్ కొట్టిన త్రివిక్రమరావు ఈ సినిమాతో చిరంజీవికి లక్కీ ప్రొడ్యూసర్ గా మారారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

ఎక్కువ చదివినవి

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...