‘నవీన్ రెడ్డి నన్ను కిడ్నాప్ చేసి కారులో బాగా కొట్టాడు. జుట్టు పట్టుకుని ముఖంపై దాడి చేశాడు. మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ అలా కొట్టలేదు. కారులో నన్ను ఘోరంగా ట్రీట్ చేశాడు’ అని మన్నెగూడలో కిడ్నాప్ గురైన యువతి వైశాలి తెలిపింది. సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్ వ్యవహారంపై ఆమె మీడియాకు వెల్లడించింది.
‘నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. నాకు దక్కకుంటే.. నిన్ను ఎవరికీ దక్కనివ్వను. నేను చెప్పినట్టు వినకపోతే మీ నాన్నను చంపేస్తా’ ఓ బంధువు ద్వారా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఇష్టంలేదని చెప్పా. అప్పటినుంచీ వేధిస్తున్నాడు. ఫేక్ ఇన్ స్టాలో నా ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. నాతో వచ్చేయ్ అనేవాడు.. ఇష్టం లేదంటే ఇంటి ముందు న్యూసెన్స్ చేసేవాడు’.
‘పోలీసులు మాకు భద్రత కల్పించాలి. నా కెరీర్ దెబ్బతింటోంది. నవీన్ దొరికిపోవడంతో ఆమె తల్లి అబద్ధాలు చెప్తోంది. నవీన్ తో నాకు పెళ్లి జరగలేదు. ఆరోజు నేను ఆర్మీ డెంటల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా. కారు ఇన్సూరెన్సులో నా పేరు పెట్టాడు. నేను సంతకం చేయలేదు. నాకు సంబంధం లేదు’ అని వెల్లడించింది.
మరోవైపు.. కేసులో ఇప్పటివరకూ 36 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. 32 మందిని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం వారిని ఇబ్రహీంపట్నం సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారుజ ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి
232092 78287An incredibly interesting examine, I may possibly not agree completely, but you do make some extremely legitimate factors. 734971
426581 174699I got what you intend,bookmarked , very decent site. 405192