Viral Video: సాధారణంగా ఎవరైనా పెంచుకునే పెంపుడు జంతువులు కుక్క, పిల్లి. వీటి సంరక్షణ, పోషణకు ఎంతో ఖర్చు పెడతారు. ఎంతో ప్రేమగా చూసుకుంటారు. రష్యా (Russia) కు చెందిన ఓ జంతు ప్రేమికురాలు కూడా అంతే. అప్పటికే ఓ కుక్కను పెంచుకుంటున్న ఆమెకు రోడ్డు పక్కన పొదల్లో ఓ కూన కనిపించింది. అది పిల్లి కూన అనుకుని ఇంటికి తీసుకెళ్లి చేరదీసింది. కానీ.. రోజులు గడిచేకొద్దీ తెలిసిన నిజం.. అది పిల్లి కూన కాదని.. బ్లాక్ పాంథర్ (Black panther) (నల్ల చిరుత) అని. ఉలిక్కిపడటం.. ఖంగుతినడం.. ఆశ్చర్యానికి గురవడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి.
చిన్న కూనని తన కుక్కతోపాటే పెంచింది. బ్లాక్ పాంథర్ అని తెలిసి భయపడినా తనతోపాటే ఉంచుకుని అనుబంధం పెంచుకుంది. ఇప్పుడా నల్ల చిరుత ఆమె పెంపుడు జంతువు. కూనను చేరదీయడం నుంచి ఇప్పుడు దానితో ఆడుకుంటున్న వీడియోలు ఇన్ స్టాలో తెగ వైరల్ అవుతున్నాయి. కుక్క-పాంథర్ ఆటలు.. వాటితో ఈమె ఆటలు, సరదాల వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
View this post on Instagram