తమిళ్ సూపర్ స్టార్ విజయ్ లేటెస్ట్ గా బిగిల్ ( తెలుగులో విజిల్ ) సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 200 కోట్ల మార్కును దాటేసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ అప్పుడే నెక్స్ట్ సినిమాను మొదలెట్టేసాడు.
లోకేష్ కానగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఢిల్లీ లో షూటింగ్ మొదలెట్టింది. లోకేష్ కనగరాజన్ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా .. ఎస్ లేటెస్ట్ గా కార్తీ హీరోగా ఖైదీ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని, అటు పరిశమ్రమ లో అమితాసక్తిని రేకెత్తించిన లోకేష్ తో సినిమా చేయడానికి పలువురు స్టార్ హీరోలు పోటీ పడ్డారు. అందులో విజయ్ ముందుగానే ఈ దర్శకుడితో సినిమా కమిట్ అయ్యాడు.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని జనవరి 1న న్యూస్ ఇయర్ కానుకగా విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలా అన్న ఆలోచనలో ఉన్నారు. కథ ప్రకారంగా ఈ సినిమాకు సంభవం అనే టైటిల్ పెట్టాలని ఫిక్స్ అయ్యారట .. తెలుగులో కూడా అదే టైటిల్ తో ఈ సినిమా విడుదల కానుంది.
సో సంభవం టైటిల్ తో జనవరి 1న ఫస్ట్ లుక్ రానుంది. విజయ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపిస్తాడట.
506675 533432I gotta favorite this website it seems invaluable really beneficial 460890
142712 420629brilliantly insightful post. If only it was as easy to implement some with the solutions as it was to read and nod my head at each of your points 195134
878086 921192Your post is truly informative. Much more than that, it??s engaging, compelling and well-written. I would desire to see even more of these types of wonderful writing. 415811