‘‘తమాషాలు చేస్తున్నావా.. ఇంటికొచ్చి నరికేస్తా.. ఏడ ఉన్నావో చెప్పు.. ఇప్పుడొస్తా. నా పేరు పెట్టి రాయడానికి ఎవడవురా.. సూటిగా చెబుతున్నా.. ఇదంతా రికార్డు చెయ్.. డీజీపీకి ఫిర్యాదు కూడా చేసుకో’’ – ఇవీ ఓ జర్నలిస్టుకు తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులు. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై జర్నలిస్టు సంతోష్ నాయక్ ఓ కథనం రాశారు.
జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములను కొందరు ఎమ్మెల్యే అండతో కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తనకు వ్యతిరేకంగా కథనం రాశాడనే ఆగ్రహంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సదరు విలేకరికి ఫోన్ చేసి దూషణలకు దిగారు. ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టారు. అంతేకాకుండా ఎక్కడున్నావో చెప్పు ఇంటికొచ్చి నరికేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇవన్నీ రికార్డు చేసిన బాధిత విలేకరి.. వెంటనే డీఎస్పీ భీంరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. దీనిపై మహిపాల్ కూడా స్పందించారు. ఆ జర్నలిస్టు వేధింపులు చాలానే ఉన్నాయని ఆరోపించారు. తన ప్రమేయం లేని వ్యవహారంలో నేరుగా తన పేరు పెట్టి కథనం రాయడంతోనే తనకు కోపం వచ్చి అలా మాట్లాడానని ఓ టీవీ ఛానల్ కు చెప్పారు. ఆ జర్నలిస్టు చేసిన అక్రమాలన్నీ పంపిస్తానని, కావాలంటే విచారణ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
967916 606707Finding the proper Immigration Solicitor […]below youll locate the link to some internet sites that we feel you must visit[…] 215561
353050 611089Some times its a pain within the ass to read what blog owners wrote but this site is actually user pleasant! . 598853
183944 104863Very interesting topic , thanks for putting up. 988676
866781 848965I discovered your weblog internet site on google and examine a number of of your early posts. Continue to sustain up the superb operate. I merely extra up your RSS feed to my MSN News Reader. In search of forward to reading more from you later on! 338682