Switch to English

టిబి స్పెషల్: ‘కవలలు’.. తెలుగు సినిమా హిట్ ఫార్ములా..! నేడు అంతర్జాతీయ ట్విన్స్ డే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు, అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు.. ఒక కుటుంబంలో తోడబుట్టిన వారి మధ్య ఉండే ఆత్మీయత అనురాగాలు వినేందుకే కాదు.. చూసేందుకు కూడా చూడముచ్చటగా ఉంటాయి. వీటిలో ‘కవలలు’ బంధం మరింత ప్రత్యేకం. ఒకే కాన్పులో జన్మించే వీరి బంధం మరింత అందంగా, ధృడంగా ఉంటుంది. ఇంట్లో కవలలు ఉన్నారంటే ఆ సంబరమే వేరు. ఏ కొందరికో కానీ దక్కని అదృష్టం అది. సినిమాల్లో ఇటువంటి ‘కవలల’ కథాంశాలతో వచ్చిన సినిమాలెన్నో ప్రేక్షకుల్ని అలరించాయి.. సినిమాకు సక్సెస్ ఫార్ములా అయ్యాయి. నేడు.. ఫిబ్రవరి 22 అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ లో ప్రేక్షకుల్ని అలరించిన కొన్ని సినిమాలను పరశీలిస్తే..

‘కవలలు’.. తెలుగు సినిమా హిట్ ఫార్ములా..! నేడు అంతర్జాతీయ ట్విన్స్ డే

ముగ్గురు మొనగాళ్లు.. మెగాస్టార్ చిరంజీవి ముగ్గరు అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమా 1994లో విడుదలైంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది. నటరాజు దత్తాత్రేయ పాత్రలో చిరంజీవి నటన అద్భుతం.

‘కవలలు’.. తెలుగు సినిమా హిట్ ఫార్ములా..! నేడు అంతర్జాతీయ ట్విన్స్ డే

హలో బ్రదర్.. కింగ్ నాగార్జున అన్నదమ్ములుగా క్లాస్, మాస్ పాత్రల్లో నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1994లో విడుదలైంది. నాగార్జున మాస్ పాత్రలో ఎంత కామెడీ పండించారో.. క్లాస్ పాత్రలో అంతే రాణించారు. కవల పిల్లల కథాంశంలో ఎన్నుకున్న పాయింట్ సినిమాకు హైలైట్. కామెడీ, సెంటిమెంట్ ప్రధానాంశాలుగా బ్లాక్ బస్టర్ హిట్ అయిందీ సినిమా.

‘కవలలు’.. తెలుగు సినిమా హిట్ ఫార్ములా..! నేడు అంతర్జాతీయ ట్విన్స్ డే

జీన్స్.. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిందీ సినిమా. 1998లో విడుదలైన ఈ సినిమాలో తమిళ హీరో ప్రశాంత్ అన్నదమ్ములుగా నటించారు. తండ్రి గా నాజర్, ఆయన కుమారులుగా ప్రశాంత్ కూడా కవలలుగా నటించారు. సినిమా కథాంశమే కవలల చుట్టూ తిరుగుతుంది. ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

‘కవలలు’.. తెలుగు సినిమా హిట్ ఫార్ములా..! నేడు అంతర్జాతీయ ట్విన్స్ డే

అర్జున్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తిరెడ్డి కవలలుగా నటించారు. 2004లో వచ్చిన ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కించారు. కవలల్లో ఉండే ఆత్మీయత, ప్రేమానురాగాలు ఏస్థాయిలో ఉంటాయో ఈ సినిమాలో చాలా హృద్యంగా తెరకెక్కించారు. సెంటిమెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. రోటీన్ కు భిన్నంగా అమ్మాయి, అబ్బాయిని కవలలుగా చూపారు.

‘కవలలు’.. తెలుగు సినిమా హిట్ ఫార్ములా..! నేడు అంతర్జాతీయ ట్విన్స్ డే

అదుర్స్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నదమ్ములుగా నటించారు. కవలలుగా ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రల్లో రాణించారు. చారి పాత్రలో ఎన్టీఆర్ నటన, కామెడీ సినిమాకు మేజర్ ఎస్సెట్. కామెడీ, యాక్షన్ కథాంశంతో 2010లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

‘కవలలు’.. తెలుగు సినిమా హిట్ ఫార్ములా..! నేడు అంతర్జాతీయ ట్విన్స్ డే

బ్రదర్స్.. తమిళ నటుడు సూర్య నటించిన ఈ సినిమాలో అవిభక్త కవలల కధాంశంతో తెరకెక్కింది. 2012లో సినిమాటోగ్రాఫర్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సున్నితమైన కధాంశం, యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.

‘కవలలు’.. తెలుగు సినిమా హిట్ ఫార్ములా..! నేడు అంతర్జాతీయ ట్విన్స్ డే

జంప్ జిలానీ.. అల్లరోడు అల్లరి నరేశ్ కవలలుగా నటించారు. అల్లరి నరేశ్ మార్క్ కామెడీతో ఈ సినిమా తెరకెక్కింది. సెంటిమెంట్, కామెడీ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ సినిమా 2014లో విడదలైంది. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.

‘కవలలు’.. తెలుగు సినిమా హిట్ ఫార్ములా..! నేడు అంతర్జాతీయ ట్విన్స్ డే

జై లవకుశ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ప్రధానాంశాలుగా ఈ సినిమా తెరకెక్కింది. రావణ పాత్రలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాబీ దర్శకత్వంలో 2018లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. అన్న కల్యాణ్ రామ్ ఈ సినిమాను తెరకెక్కించారు.

వీటితోపాటు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, వాణిశ్రీ.. ఇలా ఎందరో నటులు కవల కధాంశాలతో సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ కూడా కవలలే. కవలలకు బ్రాండ్ అంబాసిడర్లు అనిపించేలా.. ఒకే వర్చస్సుతోపాటు ఒకే డ్రెస్సింగ్ తో ప్రత్యేకంగా కనిపిస్తాను. అంతర్జాతీయ ట్విన్స్ డే సందర్భంగా.. ‘కవలలు’ అందరికీ శుభాకాంక్షలు చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....