Switch to English

‘పొరుగింటి పుల్ల సాంబారే రుచి’.. అదే మ్యాజిక్కు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

“పొరుగింటి పుల్లకూర రుచి”.. ఇది మన తెలుగు సినీ ప్రేక్షకుల్లో కొందరికి ఎప్పుడూ వర్తిస్తుంది. మన దగ్గర టాలెంట్ ఉన్నా పక్క చూపులు చూడటం అలవాటే. లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించడం కంటే పక్క కథలు, టెక్నీషియన్లు, దర్శకులంటే రుచి. ఫలితం.. వాళ్ల దగ్గర మనం లోకువ.. వాళ్లూ అంతకంటే చేస్తారు. సినిమా యూనివర్సల్ అయిందని మనం అనుకుంటే కాదు.. అవతలివారూ అనుకోవాలి. కానీ.. అలా జరుగుతుందా..? రీసెంట్ తెలుగు రిలీజ్ ఓ తమిళ సినిమాకు రీమేక్. సినిమా చూసే ప్రేక్షకులు పది మంది అయ్యారు.. విమర్శకులు, యాంటీ ఫ్యాన్స్ తొంభై మంది తయారయ్యారు. అసలు మూవీతో, నటుడితో పోలిక. ‘సింహం వేటకెళ్లేటప్పుడు దారిలో వచ్చే ఊరకుక్కల్ని పట్టించుకోదు’ జై చిరంజీవ లో చిరంజీవి డైలాగ్ వీళ్లకే.

అదే చిరంజీవి చేస్తే..

రీసెంట్ గా రజినీకాంత్ సినిమా రిలీజ్ అయింది. అందులో హిందీ, కన్నడ, మళయాల హీరోలూ నటించారు. తర్వాతి సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్ హీరోలతో మల్టీస్టారర్ అని టాక్. దీనికి కొన్ని మన తెలుగు మీడియా సంస్థలే అబ్బో, ఆహా.. అదీ సూపర్ స్టార్ అంట. ఇదే చిరంజీవి చేస్తే.. చిరంజీవి పనైపోయిందా.. పరభాషా స్టార్స్ అందుకేనా..? అంటాయి. చిరంజీవి హీరోయిన్ తో డ్యూయెట్లు, రొమాన్స్ చూసి.. తమిళ హీరోలు ఏజ్ తగ్గ సినిమాలు చేస్తుంటే చిరంజీవి ఇంకా ఏంటిలా..? అంటాయి. చిరంజీవి చేసిన ఆచార్య, గాడ్ ఫాదర్ హీరోయిన్స్, డ్యూయెట్స్ లేవు. వాటిని ఆదరించిన శాతమెంత. వాటిని ప్రస్తావించే వారు లేరు. చిరంజీవికి సలహాలిచ్చేస్తారు.. క్యూ కట్టేస్తారు. వాళ్లకే అన్నీ తెలుసు కదా మరీ..!

జస్ట్ టైమ్ గ్యాప్ అంతే..

చిరంజీవిని పక్క రాష్ట్ర హీరోతో పోలిక పెట్టే కొన్ని మీడియా సంస్థలు యూఎస్ లో చిరంజీవి రేంజ్.. అని రజినీ సినిమా కలెక్షన్లతో పోల్చి బురదలో డ్యాన్స్ ఆడుతున్నాయి. అదే చిరంజీవి 9ఏళ్ల గ్యాప్ తర్వాత చేసిన ఆరింటిలో 3 సినిమాలు 100కోట్ల షేర్ సాధించడం అవి తట్టుకోలేవు. ఆ తమిళ హీరోలకు ఒక్క బ్లాక్ బస్టర్ పడి పుష్కర కాలం దాటిందీ కనిపించదు. పైగా వారికి చిరంజీవిలా గ్యాప్ లేదు. రజినీ పెటా చిరంజీవి సైరా 100కోట్ల షేర్ కలెక్షన్లకు చాలా దూరం. అన్నాతే చూసినోళ్లు లేరు. దర్బార్ వచ్చింది వెళ్లింది. ఇప్పుడు మనకి పడనోడి సినిమాతో రజినీ సినిమా వస్తోంది.. డ్యూటీ చేసేయాలి. ఆచార్య నుంచి వాల్తేరు వీరయ్యకు గ్యాప్ 8నెలలే. భోళా శంకర్ నుంచి గ్యాప్.. మరో 8నెలలే..! అక్కడున్నది.. ‘చిరంజీవి’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...