సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే అంటే వంశీ సినిమా చేస్తున్నప్పుడు అందులో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ తో ప్రేమాయణం సాగించి .. దాదాపు ఐదేళ్ల తరువాత ఇద్దరి తరఫు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత మహేష్ – నమ్రతల అన్యోన్య దాంపత్యం కూడా సూపర్ హిట్ గానే సాగుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు కు సంబందించిన కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్న నమ్రత .. అస్సలు మహేష్ బాబు సినిమాలే చూడదట? ఏంటి ఈ వార్త విని మీరు షాక్ అవుతున్నారా ? అయ్యో ..మీరు వింటున్నది నిజమే. అయితే ఎందుకు ఆమె మహేష్ బాబు సినిమాలు చూడదు అన్నది ఇప్పుడు ఆసక్తిరేకెత్తించే ప్రశ్న ?
తాజాగా ఈ విషయం పై నమ్రత ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర జవాబులు చెప్పింది? తన వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉందని, తనకు మహేష్ కెరీర్ చాలా ముఖ్యమని నమ్రత తెలిపారు. అయితే తాను మహేష్ నటించిన సినిమాలు మాత్రం అసలు చూడనని చెప్పింది. ఫ్యామిలి అందరు కలిసి సినిమాల ప్రివ్యూలకు వెళ్లినా కూడా తాను మాత్రం ఇంట్లోనే ఉండిపోతుందట? మహేష్ సినిమా హిట్ కావాలని దేవుడిని కోరుకుంటాను ఇంట్లో ఉండి అని చెప్పింది. ఎందుకు సినిమాలు చూడరు అంటే .. ఆయన సినిమా చూస్తున్నప్పుడు చాలా టెన్షన్ గా ఫీల్ అవుతాను. ఎప్పుడు తనను హ్యాపీగా ఉండమని మహేష్ చెబుతాడు కాబట్టి ఆయన సినిమాలు చూడను అని చెప్పేసింది నమ్రత. మొత్తానికి మహేష్ సినిమాలను ఆయన భార్యే మిస్ అవుతుందన్నమాట.