సైరా .. నరసింహా రెడ్డి .. అతడు .. ఒక యోధుడు .. అంటూ తాజాగా విడుదలైన ట్రైలర్ ఓ రేంజ్ లో దుమ్ము రేపుతోంది. ఈ ట్రైలర్ హంగామా ఒక్క తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఉంది. సైరా విషయంలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చరిత్రలో కనుమరుగైన వీరుడి కథ .. భారతీయ స్వతంత్ర ఉద్యమానికి మొదటి అంకం .. సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమైంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెటు తెరకెక్కుతుంది. ఇప్పటికే ప్రేక్షకులతో పాటు అటు ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న సైరా డిజిటల్ హక్కుల విషయంలో పెద్ద దుమారం రేపింది. ఏకంగా 125 కోట్ల భారీ రేటుకు సైరా సాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ టివి జీ టివి సొంతం చేసుకుంది. జీ 5 స్ట్రీమింగ్ లో సైరా ప్రదర్శన కానుంది.
ఇక ఈ సినిమా థియేట్రికల్ హక్కుల ద్వారా ఇప్పటికే 175 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక మిగతా భాషల హక్కులు 45 కోట్లకు అమ్ముడు పోయాయట. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే .. బడ్జెట్ కు మించి లాభం రాబట్టడం విశేషం. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంచలనం క్రియేట్ చేయడం ఖాయం అంటూ మెగా ఫాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.
552832 869727Usually I do not read write-up on blogs, nonetheless I wish to say that this write-up quite forced me to check out and do so! Your writing taste has been amazed me. Thanks, very excellent post. 536478
329130 87614i always enjoy to do blog hopping and i stumbled upon your weblog .”~; 334357
257109 691517great post. Neer knew this, thanks for letting me know. 24834