Switch to English

వీర్రాజు ప్రశ్నాస్త్రం: రైతు ఆత్మహత్యలపై సీఎంని అరెస్ట్‌ చేయగలరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘ఓ వ్యక్తి ఆత్మహత్యకు సంబంధించి పోలీసుల్ని అరెస్ట్‌ చేస్తారా.? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేయగలరా.? రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ – వైసీపీ కలిసికట్టుగా అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నాయి..’ అంటూ కర్నూలు జిల్లాలో ఓ మైనార్టీ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

కర్నూలు జిల్లాకి చెందిన అబ్దుల్‌ సలాం అనే వ్యక్తిపై పోలీసులు నమోదు చేసిన కేసులు, అబ్దుల్‌ సలాం కుటుంబ సభ్యులకు పోలీసుల వేధింపులు, ఈ క్రమంలో ఆత్మహత్యకు ముందు ఓ సెల్పీ వీడియో తీసి మరీ, ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెలుగు చూశాక, రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై అటు టీడీపీ, ఇటు వైసీపీ.. బీభత్సమైన పొలిటికల్‌ డ్రామాలు ఆడేస్తున్నాయి. పైకి ఇద్దరూ మైనార్టీల మీద ప్రేమ ఒలకబోసేస్తున్నారు.. తెరవెనుక, మైనార్టీ ఓటు బ్యాంకు కోసం అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు సీన్‌లోకి బీజేపీ దూసుకొచ్చింది. దాంతో, ‘పొలిటికల్‌ ఆట’ మరింత రసవత్తరంగా మారింది.

ఇదిలా వుంటే, తుంగభద్ర పుష్కరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ, కరోనా నిబంధనల్ని ఓ పక్క బూచిగా చూపుతూ, ఇంకోపక్క 200 కోట్ల నిధుల్ని కేటాయిస్తామనడం వెనుక తమకు అనుమానాలున్నాయని సోము వీర్రాజు వ్యాఖ్యానించడం గమనార్హం. ‘ఘాట్లను నిర్మించనప్పుడు 200 కోట్ల నిధులు ఎందుకు.?’ అని ప్రశ్నించారు సోము వీర్రాజు. ‘ఓ పద్ధతి ప్రకారం రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ రాజకీయాలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల వైఖరితో ప్రజలు విసిగిపోయారు..’ అంటూ సోము వీర్రాజు తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు.

మిగతా విషయాల సంగతి పక్కన పెడితే, అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సోము వీర్రాజు ప్రస్తావించిన పాయింట్స్‌ చాలా కీలకమైనవి. ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో పోలీసుల్ని అరెస్ట్‌ చేసినప్పుడు, అమరావతి విషయంలో అలజడికి కారణమైన సీఎం జగన్‌ సహా మంత్రుల విషయమై ఎలాంటి చర్యలుండాలి.? అన్న చర్చ సాధారణ ప్రజానీకంలోనూ వ్యక్తమవుతున్నాయి. అమరావతి ఉద్యమంలో భాగంగా పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. వీర్రాజు లాజికల్‌ పాయింట్లు బాగానే వున్నాయిగానీ.. రాష్ట్ర విభజన విషయంలో ఎవర్ని అరెస్ట్‌ చేయాలి.? ప్రత్యేక హోదా విషయంలో ఎవర్ని అరెస్ట్‌ చేయాలి.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...