బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వంలో దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ప్రభాస్ సరసన బాలీవూడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే .. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట ? ఏంటి షాక్ అవుతున్నారా. మీరు వింటున్నది మాత్రం నిజంగా నిజం. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న నిల్ నితిన్ ముకేశ్ కు సల్మాన్ స్నేహితుడు కావడంతో ఆయన్ను అతిథిపాత్రకు ఒప్పించారని టాక్.
అయితే ఇందులో సల్మాన్ పాత్ర ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించేందుకు సల్మాన్ ఓకే చెప్పాడా ? లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. ఒకవేళ సల్మాన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తే అది నిజంగా సంచలనం అని చెప్పాలి. బహుబలి తో దేశవ్యాప్తంగా క్రేజీ తెచ్చుకున్న ప్రభాస్ చేస్తున్న సాహో పై ఒక్క సౌత్ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమా హిందీ హక్కులకోసం అప్పుడే భారీ పోటీ ఏర్పడిందట. అయితే ఈ సినిమా హిందీ రైట్స్ ని కరణ్ జోహార్ తీసుకునే అవకాశాలు ఉన్నట్టు టాక్.
ఆగస్టు 15 న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా జాన్ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. జాన్ చిత్రాన్ని సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి చాలా గ్యాప్ తో నిరాశలో ఉన్న ప్రభాస్ ఫాన్స్ కు వెంట వెంటనే సినిమాలతో పండగే పండగ.
532854 577428Some truly nice stuff on this web site, I love it. 601404