సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej)హీరోగా నటించిన ‘బ్రో'( BRO)సినిమా ఈరోజు విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సందర్భంగా తేజ్ తన మామయ్య పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
‘ నా కల నెరవేరిన ఈరోజు నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా గురువు, మావయ్య, సర్వస్వం అయిన పవన్ కళ్యాణ్ మావయ్యతో నటించడం గొప్ప అదృష్టం. నేను ఇప్పటికీ ఆయన వేలు పెట్టుకొని నడిచే చంటి పిల్లాడినే. అలాంటి వ్యక్తితో నటించే అవకాశాన్ని ఇచ్చినందుకు త్రివిక్రమ్ సార్ కి ధన్యవాదాలు. నన్ను నమ్మి ఎంత పెద్ద ప్రాజెక్టులో భాగం చేసిన సముద్రఖని, వివేక్, టీజీ విశ్వప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి రుణపడి ఉంటాను. నేను స్ఫూర్తిగా తీసుకునే మా ముగ్గురు మామయ్యలు, వారి అభిమానులు నాకు సపోర్టుగా నిలవడం సంతోషంగా ఉంది. ‘బ్రో’ సినిమా మీ ముందుకు వచ్చింది. ఇది మన అందరిదీ. దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ నోట్ రాసి పవన్ కళ్యాణ్ తో ఉన్న తన చిన్నప్పటి ఫోటోను షేర్ చేశారు.
‘బ్రో’ సినిమాని సముద్రఖని( Samuthirakani) తెరకెక్కించారు. కేతికా శర్మ( Ketika Sharma), ప్రియా ప్రకాష్ వారియర్( Priya prakash Warrior) హీరోయిన్లు. ఈ సినిమాలో పవన్ మార్క్ డైలాగులు, డాన్సులు ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.
అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ!!!
Enjoy #BroTheAvatar is all yours from today. pic.twitter.com/Spm3djhIQT
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 27, 2023