Switch to English

‘సాహో’: 130 కోట్లకి పెంచేశారెందుకని.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ సినిమా తొలి రోజు డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న విషయం విదితమే. టాక్‌ సంగతెలా వున్నా, సినిమాపై క్రియేట్‌ అయిన హైప్‌, కనీ వినీ ఎరుగని స్థాయిలో అత్యధిక థియేటర్లలో సినిమా విడుదల చేయడం, టిక్కెట్ల ధరల్ని పెంచేయడం.. ఇలా చాలా కారణాల నడుమ, తొలి రోజు గ్రాస్‌ వసూళ్ళు చాలా గట్టిగానే వచ్చాయి. ‘భారీ వసూళ్ళే తొలిరోజు వచ్చాయి.. కానీ, 100 కోట్లు టచ్‌ చేయలేదు’ అని నిన్న సాయంత్రానికే ఓ క్లారిటీ బయటకు వచ్చింది.

కానీ, ఉదయానికే సీన్‌ మారిపోయింది. ‘సాహో’ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 104 కోట్లు వసూలు చేసిందన్నారు. అంతలోనే, అది 118 కోట్లకు పెరిగింది. మధ్యాహ్నానికి ఆ 114 కోట్ల ఫిగర్‌ని రౌండప్‌ చేసి, 130 కోట్లుగా ప్రకటించారు. ‘సాహో తొలి రోజు గ్రాస్‌ 130 కోట్లు ప్లస్‌..’ అంటూ పోస్టర్లు వదలడంతో, ఇప్పుడీ వ్యవహారం సోషల్‌ మీడియాలో నవ్వులపాలైపోతోంది. ‘ఏమో, సాయంత్రానికి 150 కోట్లు అంటారేమో..’ అని కొందరు సెటైర్లు వేస్తోంటే, రేప్పొద్దున్నకి బాహుబలిని మించిపోయిందని చెబుతారేమోనంటూ.. ప్రత్యర్థుల నుంచి కామెంట్స్‌ పడుతున్నాయి. ‘

రంగస్థలం’ సాధించిన వసూళ్ళ తర్వాత, ‘భరత్‌ అనే నేను’ సినిమా విషయంలో వసూళ్ళను వాస్తవానికి మించి చాలా చాలా ఎక్కువగా చూపిన విషయం విదితమే. ‘మహర్షి’ సినిమాకి కూడా ఇదే తరహా తంతు నడిచింది. అందుకేనేమో, ‘కొబ్బరిమట్ట’ సినిమా ప్రమోషన్‌ కోసం వేసిన పోస్టర్‌లో.. అనూహ్యమైన రికార్డుల్ని పొందుపర్చారు.. పెద్ద హీరోల సినిమాల్ని ర్యాగింగ్‌ చేసి పారేశారు.

ఒక్కటి మాత్రం నిజం. ‘సాహో’ సినిమా రిలీజ్‌కి ముందు, దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్‌ని పొందింది. సినిమా సక్సెస్‌ అవడం, ఫెయిల్‌ అవడం అన్నది వేరే చర్చ. పబ్లిసిటీ కోసం ఇచ్చే ప్రకటనలు నవ్వులపాలైతే.. అది ‘సాహో’ గొప్పతనాన్ని తగ్గించేస్తుందన్నది సగటు సినీ అభిమాని ఆవేదన.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...