Switch to English

వర్మ మరో దుమారం.. శశికళ !

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ .. ఇప్పటికే ”లక్ష్మిస్ ఎన్టీఆర్” పేరుతొ సినిమా చేసి పెద్ద దుమారమే రేపాడు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన రెండు ముఖ్య సంఘటనలు .. ఒకటి లక్ష్మి పార్వతి అయన జీవితంలోకి ఎంట్రీ కావడం .. రెండు చంద్రబాబు వెన్నుపోటు అంశాలను ప్రధానంగా తీసుకుని, ఇది కుటుంబ కుట్రల కథ అంటూ తెరకెక్కించిన ”లక్ష్మిస్ ఎన్టీఆర్” ఇటీవలే ఒక్క ఆంధ్రా లో తప్ప అంతటా విడుదలై సంచలనం రేపింది.

సినిమా విడుదలకు ముందున్న క్యూరియాసిటీ .. విడుదల తరువాత తగ్గింది. దానికి కారణం లేకపోలేదు .. లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా కేవలం లక్ష్మి పార్వతి కోణంలోనే తీశారన్న ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పక్కన పెడితే .. తన నెక్స్ట్ సినిమా గురించి అప్పుడే ప్రకటించేశాడు వర్మ.

ఈ సారి ఆయన ఫోకస్ తమిళనాడు పై పడింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియనేస్తం శశికళ జీవిత కథతో సినిమా చేస్తానంటూ సోషల్ మీడియా లో శశికళ పేరుతొ ఓ పోస్టర్ పెట్టేసి .. నెక్స్ట్ సినిమా ఇదే అంటూ ప్రకటించేశాడు. ప్రేమ ప్రమాదకరమైన రాజకీయం అంటూ దానికి ట్యాగ్ కూడా పెట్టేసారు. పైగా ఈ ప్రాజెక్టు ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందంటూ పేర్కొన్నాడు వర్మ.

మనసంటూ లేని కఠినాత్ములు , జైళ్లు, మన్నార్ గుడి గ్యాంగ్స్ కు వ్యతిరేకంగా అల్లుకున్న ఓ బంధం కథ ఇది అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం వర్మ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. అన్నట్టు ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో తప్ప అంతటా విడుదల చేస్తానంటూ ప్రకటించాడు. ప్రస్తుతం శశికళ సినిమా అనగానే తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ అవుతున్నాయి.

ఈ సినిమాలో ఎవరి జాతకం గురించి బయటపెడతాడో అంటూ చర్చలు జరుగుతున్నాయట. జయతో ఎంతో అనుబంధం ఉన్న శశికళ జయ మరణం తరువాత రాజకీయ సమీకరణ చేసి ముఖ్యమంత్రి కావాలని ప్లాన్ వేసింది . కానీ దానికి తమిళనాడు జనాలు ఒప్పుకోలేదు పైగా, ఆమె పై ఉన్న కేసులను బయటికి తేవడమే శశికళ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి శశికళ తో మరో సంచలనాన్ని ప్రకటించిన వర్మ … ఈ సినిమా విషయంలో ఇంకెంత దుమారం రేపుతాడో చూడాలి !!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...