లాక్ డౌన్ లో సినిమా ఇండస్ట్రీ అంతా సైలెంట్ గా ఇంట్లో ఉంటే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ మాత్రం ఓటిటి కోసం సినిమాల మీద సినిమాలు తీస్తూ బిజీ బిజీ గా ఉన్నాడు. ఇప్పటికే ఆర్జీవీ నుంచి వచ్చిన క్లైమాక్స్, నగ్నం సినిమాలు ఇప్పటికీ రిలీజ్ అయ్యాయి. కంటెంట్ పరంగా బ్యాడ్ అనిపించుకున్నప్పటికీ ఆర్జీవికి కాసులు మాత్రం బాగానే వచ్చాయి.
అదే పంథాలో హీరోయిన్ అందాల ఆరబోతతో మరో సినిమాకి శ్రీకారం చుట్టాడు ఆర్జీవీ. అదే.. ‘థ్రిల్లర్’. ఈ సినిమా ద్వారా అప్సర రాణిని ఓటిటికి పరిచయం చేస్తూ ఓ బోల్డ్ ఫోటోషూట్ చేసాడు. ఆ ఫొటోస్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫోటలకంటే మించి ఆర్జీవీ అప్సర రాణితో పోస్ట్ చేస్తున్న కిస్సింగ్ ఫోటోలు, హాగ్ ఫోటోలు సెన్సేషన్ అవుతున్నాయి. ఇది ఆర్జీవికి కొత్తేమికాదు.. కానీ ప్రేక్షకులు మాత్రం ఎప్పటికప్పుడు ఆర్జీవీ చేష్టలకు అవాక్కవుతూనే ఉన్నారు. ఆ ఫొటోస్ మీకోసం..