Switch to English

దుష్యంత్ సక్సెస్.. పవన్ ఫెయిల్.. ఎలా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

హర్యానాలో ఎన్నికలు ముగిశాయి. ఎలాంటి సమస్యలూ లేకుండా ఖట్టర్ నేతృత్వంలో బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది. డిప్యూటీ సీఎంగా జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆయన గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో తీవ్రంగా పోరాడిన ఆయన.. ఫలితాలు వెలువడిన తర్వాత ఏకంగా కింగ్ మేకర్ పాత్ర పోషించి, డిప్యూటీ సీఎం అయిపోయారు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను దుష్యంత్ తో పోల్చి చూస్తున్నారు. దుష్యంత్ సక్సెస్ కావడానికి, పవన్ ఫెయిల్ అవడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. దుష్యంత్ వయసు 31 ఏళ్లే అయినా.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో పోరాడారు. ఆయనకు సినీ గ్లామర్ లేకపోయినా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. అటు కాంగ్రెస్ ను, ఇటు బీజేపీని సమాన ప్రత్యర్థులుగా చూడటంతో పలువురు తటస్థులు దుష్యంత్ వైపు మొగ్గు చూపారు. దీంతో పది సీట్లు గెలుచుకుని కింగ్ మేకర్ కాగలిగారు.

అయితే, పవన్ మాత్రం అలా వ్యవహరించలేకపోయారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ లక్ష్యంగానే పోరాడారు.. ఆ పార్టీపైనే విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీపై పల్లెత్తు మాట అనలేదు. మరోవైపు ఆయన తెలుగుదేశం పార్టీకి రహస్య మిత్రుడు అంటూ వైఎస్సార్ సీపీ బలంగా చేసిన ప్రచారం కూడా వ్యతిరేకంగా మారింది. ఫలితంగా ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాకాకుండా దుష్యంత్ తరహాలో ఇటు వైఎస్సార్ సీపీని, అటు టీడీపీని కూడా సమాన స్థాయిలో ప్రత్యర్థులుగా చూసి ఉంటే మరికొన్ని సీట్లు గెలుపొందే అవకాశం ఉండేదని అంటున్నారు.

ఎన్నికల్లో ఇంత దెబ్బ తిన్నా.. పవన్ వైఖరిలో ఇంకా మార్పు రాలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ టీడీపీపై ఈగ వాలనీయకుండా చూసే విధంగానే ఆయన వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇలాగే ఉంటే జనసేనకు రాజకీయంగా కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

3 COMMENTS

  1. 845354 87788Im impressed, I ought to say. Genuinely rarely do you encounter a weblog thats both educative and entertaining, and let me let you know, you may have hit the nail about the head. Your concept is outstanding; ab muscles something that too couple of people are speaking intelligently about. Im delighted i discovered this in my hunt for something about it. 904053

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...