Rashmika: ఇటివల రష్మికను ఉద్దేశిస్తూ ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసాయి. దీంతో జరిగిన వ్యవహారంపై ఐశ్వర్య వివరణ ఇవ్వడంతో రష్మిక మందన (Rashmika Mandanna) స్పందించింది. ‘ఇప్పటివరకూ ఈ విషయం గురించి తెలీదు. నీ మాటలు నాకు అర్ధమయ్యాయి. నీపై ప్రేమ, గౌరవం ఉన్నాయి. నువ్వు ఎవరికీ ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నటించిన ఫర్హానా సినిమా బాగుంది. ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేసింది.
జరిగింది ఇదీ.. ఐశ్వర్య నటించిన ఫర్హానా సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ.. ‘నాకు పుష్పలో రష్మిక, దసరాలో కీర్తి సురేశ్ పాత్రలు సెట్ అవుతాయి. అటువంటి పాత్రల్లో నటించాలనుంది’ అని అంది. అయితే.. ఆమె వ్యాఖ్యలు రష్మికకు వ్యతిరేకంగా ఉన్నట్టు కామెంట్స్ రావడంతో ఐశ్వర్య స్పందించింది. ‘నా మాటలు వక్రీకరించారు. పుష్పలో రష్మిక పాత్ర నాకు ఇన్ స్పిరేషన్. తోటి నటీనటులపై నాకు గౌరవం ఉంది. నెగటివ్ కామెంట్స్ దయచేసి ఆపండ’ని పేర్కొంది. దీనిపైనే రష్మిక స్పందించింది.