Switch to English

‘రామారావు ఆన్ డ్యూటీ’ యూనిక్ థ్రిల్లర్ : శరత్ మండవ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలకు సిద్ధం అయ్యింది. రవితేజ, సుధాకర్ చెరుకూరిల నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు శరత్ మండవ మీడియాతో మాట్లాడారు.

రవితేజ ఏం డ్యూటీ ఏంటీ…

ఒక మిస్సింగ్ కేసుని పోలీసులు, లేదా క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. కానీ సివిల్ ఆఫీసర్ గా రామారావు ఈ కేసుని ఎందుకు డీల్ చేశాడనేది ఇందులో చాలా యునిక్ పాయింట్.

కథలో ఇసుక మాఫియా పాత్ర..

ప్రత్యేకంగా ఇసుక మాఫియా అని లేదు. కలెక్టరేట్ తో ముడిపడిన విభాగాలన్నీటికీ చాలా వ్యవస్థలపై ప్రత్యేక అధికారాలు వుంటాయి. కథలో ఆ సీన్ కి సంబధించిన అంశం వచ్చినపుడు దాని గురించి కొంత చెప్పడం వుంటుంది.

రామారావు ఆన్ డ్యూటీ కథ ఆలోచన…

కథలు ఎప్పుడూ మనసులో తిరుగుతూనే వుంటాయి. ఏదో ఒక హుక్ పాయింట్ దొరికినప్పుడు పూర్తిగా రాసేస్తాం. ఇది కూడా నాలుగేళ్ల క్రితం నుండి వున్న ఆలోచన.

రామారావు ఆన్ డ్యూటీ లో ఎంటర్ టైన్మెంట్‌..

ఎంటర్ టైన్మెంట్ అంటే కామెడీ అని నేను అనుకోవడం లేదు. ఆడియన్స్ ని యంగేజ్ చేయడమే ఎంటర్ టైన్మెంట్. ఇందులో ఫన్ ఫ్యాక్టర్ కూడా వుంటుంది.

రామారావు ఆన్ డ్యూటీ లో వున్న కొత్తదనం…

కథ చాలా యునిక్ గా వుంటుంది. రవితేజ గారి గత సినిమాల ఛాయలని రిపీట్ కాకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను.

మీ మొదటి సినిమా తర్వాత ఇంత విరామంకి కారణం…

నా మొదటి సినిమా కేఓ 2 తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే పెద్ద హీరోలకు ఎప్పుడూ ఒక లైనప్ వుంటుంది. ఆ లైన్ లో ఏదైనా డ్రాప్ అయితే మన సినిమా ముందుకు వస్తుంది. మధ్యలో విశాల్ గారితో ఒక ప్రాజెక్ట్ చర్చలు జరిగాయి. తర్వాత కరోనా వచ్చింది. రామారావు ఆన్ డ్యూటీ కూడా చాలా రోజుల క్రితమే రవితేజ గారి చెప్పాను.

రామారావు ఆన్ డ్యూటీ ” టైటిల్ గురించి…

రామారావు అనేది పవర్ ఫుల్ పేరు. పెద్దాయన లేకపోయినా ఒక సర్వే పెడితే నెంబర్ వన్ తెలుగు పర్సనాలిటీ గా ఆయన పేరు వచ్చింది. తర్వాత అదే పేరుతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ హీరో. అలాగే కేటీఆర్ గారు కూడా గ్రేట్ లీడర్. ”రామారావు’ అనేది ఒక స్ఫూర్తిని నింపే వ్యక్తిత్వం. అందుకే ఈ పాత్రకు రామారావు అని పేరు పెట్టాను.

వేణు తొట్టంపూడి గారు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా…

కీలకమైన సిఐ పాత్రకు ఎవరైతే బావుంటుదని ఆలోచిస్తున్నప్పుడు వేణు గారు స్ట్రయిక్ అయ్యారు. ఆయన సినిమాలు, వీడియోలు ఇప్పటికీ చాలా పాపులర్. ఈ పాత్రకు ఆయన అయితే బావుంటుదని వెళ్లి ఆయన్ని కలిశాను. లక్కీగా ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు.

నిర్మాతల సహకారం…

కరోనా లాంటి ప్రతికూల పరిస్థితిలో కూడా ఈ సినిమాని ఇంత గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకు రావడం వారి గొప్ప సంకల్పం వలనే సాధ్యమైయింది. సినిమాని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు.

ఇది యధార్ధ సంఘటనలు ఆధారంగా…

కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా సినిమా రూపొందించాం. అందులో ఒక సంఘటన నా అనుభవంలో కూడా వుంది.

రజిషా విజయన్ ని తీసుకోవడానికి కారణం…

మాళిని పాత్రకు గ్లామర్ కంటే ఎమోషనల్ ఎక్కువ వుండే ఒక యునిక్ నటి కావాలనిపించింది. రజిషా విజయన్ ఆ పాత్రకు సరిగ్గా నప్పుతుందని అనిపించింది.

ఇందులో ఐదు మంది స్టంట్ మాస్టర్లు ఉండటానికి కారణం…

ఇందులో ఫైట్లు అన్నీ కథలోనే వస్తాయి. పెద్ద స్టంట్ మాస్టర్లు మల్టిఫుల్ ఒప్పుకోరు. కానీ నేను రిక్వస్ట్ చేశాను. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లని డిజైన్ చేశారు.

సంగీత దర్శకుడి గురించి..

ఖైదీ సినిమా చూసిన తర్వాత నే రవితేజ గారికి ఫోన్ చేసి సామ్ సిఎస్ ని అనుకుంటున్నాని చెప్పాను. రవితేజ గారికి కూడా సామ్ అంటే అప్పటికే గురి వుంది.

సీసా పాట…

సీమ ప్రాంతంలో ‘కులుకు భజన’ చాలా పాపులర్. దానిని ఇంకా కాస్త వినోదాత్మకంగా ఉండేలా కొన్ని ట్యూన్స్ అనుకున్నాం.

2 గంటల 30 నిమిషాల రన్ టైమ్‌…

నా వరకూ కథ ఒక దేవాలయం లాంటింది. దానికంటూ ఒక నిర్మాణం వుంటుంది. లెజండరీ దర్శకులు దాసరి నారాయణ రావు గారి మాటలు నాకు స్ఫూర్తి. ”ఒక కథ రాసేటప్పుడు ఆ కథే తనకు కావాల్సిన అన్ని సమకూర్చుకుని పూర్తి చెసుకుంటుంది. హిట్, ఫ్లాప్ మన చేతిలో లేదు, మంచి చెడు మాత్రం మన చేతిలో వుంటుంది” దాసరి గారు చెప్పిన ఈ మాటలు లైఫ్ టైం పాటిస్తాను.

సోషల్ మీడియాపై ఘాటు వ్యాఖ్యలు…

సినిమాని పూర్తి గా చూసి అర్ధం చేసుకొని విశ్లేషించుకొని దాని గురించి రాయడంలో ఎలాంటి ఆభ్యంతరం లేదు. రివ్యూలు వుండాలి. చాలా మంది మంచి రివ్యూ రైటర్స్ తెలుగులో వున్నారు. ప్రోడక్ట్ అనేది వినియోగదారుడికి చేరక ముందే ఇంత నెగిటివిటీ ఎందుకు ? అనే బాధతోనే నా అభిప్రాయం చెప్పాను.

”రామారావు ఆన్ డ్యూటీ ‘ కి సీక్వెల్…

ప్రస్తుతానికి సీక్వెల్ ఆలోచన లేదు. ఐతే ఇది బర్నింగ్ ఇష్యూ. దిన్ని కంటిన్యూ చేద్దామని ఆసక్తితో ఎవరైనా వస్తే .,. నా ఆలోచనలు పంచుకోవడానికి రెడీగా వుంటాను.

ఏ జోనర్ లో మీకు బలం….

నా బలం ఏమిటో తెలీదు కానీ.,.నా బలహీనత తెలుసు. శేఖర్ కమ్ముల గారి లాంటి సినిమాలు చేయలేను.

కొత్తగా చేయబోయే సినిమాలు..

ఇంకా ఏదీ అనుకోలేదు. ప్రస్తుతం ” రామారావు ఆన్ డ్యూటీ ‘పైనే నా దృష్టి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...