మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. మొదట్లో అందరూ ఇది కేమియో పాత్ర అని అనుకున్నారు కానీ దాదాపు 40 నిమిషాల నిడివున్న పాత్రను పోషిస్తున్నాడు చరణ్. ఇటీవలే షూటింగ్ లో కూడా పాల్గొనడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం షూటింగ్ సజావుగా సాగుతోంది.
ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆచార్యలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. ఇందులో సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తనదేమి చిన్న పాత్ర కాదన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక నాన్నతో కలిసి నటించడం తన అదృష్టమని పేర్కొన్నాడు చరణ్.
గతంలో మగధీర, బ్రూస్ లీ చిత్రాల్లో చిరు గెస్ట్ పాత్ర వేయగా, ఖైదీ నెం 150లో చరణ్ ఒక పాటలో మెరిశాడు. మొదటిసారి వీరిద్దరూ కలిసి పూర్తి స్థాయిలో నటిస్తుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
541711 75986I dont generally comment but I gotta state thanks for the post on this great 1 : D. 888080
401170 355915Aw, this is an extremely good post. In thought I would like to put in location writing like this moreover – spending time and actual effort to create a excellent article but exactly what do I say I procrastinate alot through no indicates seem to get something accomplished. 192076